దర్శకుడు వీరభద్రం చౌదరి, హీరో రాజశేఖర్ కోసం ఓ కధను తయారు చేసుకున్నాడు. చెప్పాడు. రాజశేఖరూ ఓకే చేశాడు. కానీ తర్వాతే మొదలైయింది అసలు కధ. మార్పుల పేరుతో వీరభద్రంకు చుక్కలు చూపిస్తున్నాడు రాజశేఖర్. సినిమా చేద్దామన్న మాట తప్పితే మేటర్ అసలు ముందుకు కదలడం లేదు. ఇప్పటికే కధను చాలా సార్లు మార్చాడు వీరభద్రం. కానీ రాజశేఖర్ మాత్రం ఓకే అనడం లేదు. ఇంకా మార్పులు కోరుతున్నాడు.
వీరభద్రం నుండి సినిమా వచ్చి చాలా కాలమైయింది. చుట్టాలబ్బాయి చివరి సినిమా. అంతకుముందు కూడా చాలా పెద్ద గ్యాప్ వుంది. భాయ్ తో డిజాస్టర్ ఇచ్చాడు వీరుభద్రం. ఇప్పుడు రాజశేఖర్ ని నమ్ముకున్నాడు. అయితే ఆయన పద్దతి మాత్రం సినిమా చేసేలా కనిపించడం లేదు. అలాగని ”కాదు’ అని చెప్పడం లేదు. అటూ ఇటూ కాక మధ్యన వుంది వీరభద్రం పరిస్థితి. రాజశేఖర్ కి సినిమాలు చేసే మూడ్ పూర్తిగా తగ్గిపోయిందని అందుకే ఇలా కాలయాపన చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. అందుకేనేమో.. ఓ తమిళ దర్శకుడి తో ఓ సినిమా మొదలెట్టి, ఆపేశారు. ఆ సినిమానే ఇప్పుడు సుమంత్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు ఐనా పట్టాలెక్కుతుందో.. లేదో..?