‘హిట్’ పై నడిచే ఇండస్ట్రీ ఇది. ఇక్కడ ప్రతీ శుక్రవారానికి జాతకాలు మారిపోతుంటాయి. బండ్లు ఓడలవ్వడం, ఓడలు బండ్లగా మారడం వెరీ కామన్. వరుసగా ఓ రెండు ఫ్లాపులు పడితే చాలు.. మళ్లీ లైన్ లో కనిపించడం కష్టమే. ఇప్పుడు రాజ్ తరుణ్ పరిస్థితి కూడా ఇలానే వుంది. వరుసగా మూడు హిట్లతో యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రాజ్ తరుణ్. అతడి మాట, నటన ప్రేక్షకులకు నచ్చాయి. అయితే తర్వాత ఫ్లాపుల పరంపర మొదలైయింది. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైయిందంటే.. రాజ్ తరుణ్ కి రెమ్యునిరేషన్ లేదు. కేవలం నెల జీతానికి పనిచేస్తున్నాడు.
ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాలో నటిస్తున్నాడు రాజ్ తరుణ్. ఈ సినిమాకి రెమ్యునిరేషన్ లేదు. దిల్ రాజు బేనర్ వాల్యూ బట్టి కేవలం నెల జీతానికి పని చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. సినిమా విడుదలై లాభాలు వస్తే కనుక అప్పుడు రెమ్యునిరేషన్ గా కొంత ఇస్తానని దిల్ రాజు ముందే క్లియర్ గా చెప్పేశారట. సినిమా పరిశ్రమలో హిట్ చాలా మేటర్ చేస్తుందని చెప్పడానికి రాజ్ తరుణ్ తాజా ఉదాహరణ. అయితే ఈ పరిస్థితి మారడానికి పెద్ద టైం పట్టదు. ఒక్క హిట్ పడితే గనుక మళ్ళీ రాజ్ తరుణ్ కి పునర్వైభవం రాకమానదు. మరా హిట్ ‘ఇద్దరి లోకం ఒక్కటే’తోనే రావాలనే కోరుకుందాం. డిసెంబర్ లో ఈ చిత్రం విడుదల కానుంది.