జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలో చేపట్టిన లాంగ్ మార్చ్ కు ప్రభుత్వం తరపున అడ్డంకులు ఎదురవుతున్నాయి. పర్మిషన్ విషయంలో.. రకరకాల రూమర్స్‌ను ప్రచారం చేస్తున్నారు. అటు ఇస్తున్నాం… అని కానీ.. ఇటు ఇవ్వట్లేదు అనే విషయాన్ని కూడా క్లారిటీ గా చెప్పడం లేదు. పర్మిషన్ ఇవ్వలేదంటూ.. సోషల్ మీడియాలో హైలెట్ కావడంతో… పవన్ కల్యాణ్ కూడా స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఆ వార్తలన్నీ అవాస్తమని ప్రకటించారు. అయితే.. విశాఖలో మాత్రం.. పరిస్థితి జనసేన లాంగ్ మార్చ్ కు అనుకూలంగా లేదు. పోలీసులు అనేక రకమైన ఆంక్షలు పెడుతున్నారు. వారం రోజుల నుంచి జనసేన నేతలు.. అనుమతుల కోసం తిరుగుతున్నప్పటికీ.. ఇప్పటికీ సభాస్థలి, పార్కింగ్ విషయంలో పర్మిషన్లు ఇచ్చేందుకు వెనుకాముందాడుతున్నారు.
ఏయూలో పార్కింగ్ స్థలం ఇచ్చేందుకు వర్సిటీ అధికారులు నిరాకరించారు. సభకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద స్థలం ఇవ్వాలని జనసేన నేతలు కోరుతున్నారు. అయితే.. అక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని ఉమెన్స్ కాలేజ్ ఎదురుగా ఉన్న… స్థలంలో సభ ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు జనసేన నేతల్ని కోరుతున్నారు. వివిధ అంశాల్లో జనసేన నేతలు ఒకటి కోరితే.. పోలీసులు మరో విధంగా స్పందిస్తున్నారు. దీంతో ప్రభుత్వం చివరి క్షణం వరకు కావాలనే అడ్డంకులు సృష్టిస్తోందన్న అభిప్రాయంతో జనసైనికులు ఉన్నారు.
ప్రస్తుతం ప్రజల్లో.. ఇసుక కొరత విషయంలో తీవ్ర అసంతృప్తి ఉంది. పలువురు భవన నిర్మాణ కార్మికులు .. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాగే పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ కు… దాదాపుగా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించడమో.. సంఘిభావం తెలపుడమో చేశాయి. పైగా జన సైనికులు.. చలో విశాఖ అంటూ.. కోస్తా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల అడ్డంకులు జన సైనికుల్ని నిరాశకు గురి చేస్తున్నాయి.