ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కులాలపై.. కులాలను ఎగదోయడంలో.. ఏ మాత్రం రాజీపడటం లేదు. పవన్ కల్యాణ్ చేస్తున్న లాంగ్ మార్చ్…పై… వైసీపీలో ఉన్న కాపు నేతలందరితోనూ.. తీవ్ర విమర్శలు చేయించారు. చివరికి పీఆర్పీలో ఉండి… చిరంజీవి ప్రాపకంతో ఎమ్మెల్సీ అయిన.. సి.రామచంద్రయ్య అనే నేత కూడా.. పవన్ కల్యాణ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇక కాపు మంత్రుల సంగతి చెప్పనక్కరలేదు. వరుస పెట్టి.. పవన్ కల్యాణ్..పై విరుచుకుపడ్డారు. మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ అయితే.. కట్టుతప్పి పోయారు. వీరు కూడా.. గతంలో పీఆర్పీలో పని చేసిన వాళ్లే. పవన్ కల్యాణ్… వెళ్లి సినిమాలో నటించుకోవండ మంచిదన్నట్లుగా.. ఈ నేతలు ఎద్దేవా చేశారు. ఆయనే గెలవలేదు.. ఇక ప్రజల కోసం ఏం చేస్తారంటూ.. వ్యక్తిత్వాన్ని సైతం కించపరిచే ప్రయత్నం చేశారు.
పవన్ కల్యాణ్ గెలవలేదు.. ఆయనకు బలం లేదని అనుకునే మంత్రులు.. లాంగ్ మార్చ్‌పై ఇంతగా ఎదురు దాడి చేయడం ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇసుకకొరతతో కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటూంటే.. కనీసం స్పందించకుండా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటోంది. అదే… రాజకీయ పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలపై మాత్రం.. పెద్ద నోళ్లు చేసుకుని విరుచుకుపడుతున్నారు. వారిని పోరాటం చేయవద్దని.. వ్యక్తిగత దూషణలతో.. కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. ఈ వ్యవహారంలో.. మంత్రులంతా.. కులాన్నే ఉపయోగించుకుంటున్నారు.
చంద్రబాబుపై కమ్మ నేతలతో తిట్లు తిట్టిస్తున్నారు. పవన్ కల్యాణ్‌పై కాపు నేతలతో.. దారుణమైన మాటలు అనిపిస్తున్నారు. ఆయా కులాల నేతల మధ్య… వారితోనే చిచ్చు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి.. వ్యూహాత్మకంగా అందర్నీ ఉపయోగించుకుంటున్నారు. రాజధానిపై.. వ్యతిరేక ప్రకటలను కాపు నేతలతో చేయిస్తున్నారు. వివాదాస్పద ప్రకటనలు మొత్తాన్ని… కాపు, కమ్మ మంత్రులతో చేయిస్తున్నారు కానీ.. ఒక్కరంటే.. ఒక్క రెడ్డి నేతను కూడా.. దీనికి ఉపయోగించుకోవడం లేదు. ప్రజల్లో వారంతా మంచి వారుగా… ఇతరులు చెడ్డ నేతలుగా… మార్చేందుకు జగన్ స్కెచ్ వేశారని.. వైసీపీలోనే చర్చ జరుగుతోంది. జగన్ వ్యూహం అర్థమైనా.. నేతలు.. ముందుకు సాగక తప్పడం లేదు.