ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంను.. ఆకస్మికంగా ప్రభుత్వం బదిలీ చేసింది. తక్షణం సీఎస్ పదవి నుంచి రిలీవ్ చేస్తూ.. హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. జీఏడీ పొలిటికల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్.. కొద్ది రోజుల క్రితం.. సీఎంవోలో పొలిటికల్ సెక్రటరీగా వచ్చారు. అప్పట్నుంచి… సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఆయనకు సరిపడటం లేదు. పది రోజుల కిందట.. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను కూడా జీవోలుగా విడుదల చేయడం లేదంటూ.. సీఎస్‌ను పట్టిచుకోకుండానే.. జీవోలు విడుదల చేసే అధికారాన్ని .. ప్రవీణ్ ప్రకాష్.. తనకు దఖలు పర్చుకుంటూ.. బిజినెస్ రూల్స్ మార్చేశారు. అప్పట్నుంచి ఎల్వీ సుబ్రహ్మణ్యం రగిలిపోతున్నారు. ఈ క్రమంలో… గత బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశానికి సీఎస్‌కు తెలియకుండా.. కొన్ని అంశాలు వచ్చాయి. అందులో కొన్ని వివాదాస్పదమైనవి కూడా ఉన్నాయి.
దీంతో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఫైరయ్యారు. తనకు తెలియకుండా.. కేబినెట్ అజెండాలో అంశాలను చేర్చారని. అందు కోసం విధివిధానాలు పాటించలేదని మండి పడుతూ.. ప్రవీణ్ప్రకాష్కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. వారంలో.. సమాధానం చెప్పాలని .. లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ప్రవీణ్ ప్రకాష్.. ఎల్వీ సుబ్రహ్మణ్యానికి వారం సమయం కూడా ఇవ్వలేదు. షోకాజ్ నోటీసు జారీ చేసిన.. తర్వాతి వర్కింగ్ డేనే… ఏకంగా ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేస్తూ… ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశిస్తేనే… ప్రవీణ్ ప్రకాష్.. ఈ ఆదేశాలు జారీ చేశారని చెబుతున్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీ అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. అసలు సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యం నియామకమే వివాదాస్పదం. ఎన్నికల సమయంలో.. ఎన్నికల సంఘం ఆయనను సీఎస్ గా నియమించింది.
ఆ సమయంలో.. ఆయన ప్రభుత్వ సమాచారాన్ని.. వైసీపీ పెద్దలకు పంపుతూ… వారికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల విధుల్లో కూడా.. జోక్యం చేసుకున్నారు. ఎన్నికల అధికారి తరపున సమీక్షలు చేశారు. వైసీపీ విజయం సాధించిన తర్వాత ఆయన సేవలకు గుర్తింపుగా… ఆయననే సీఎస్ గా కొనసాగించారు జగన్. నిన్నామొన్నటి వరకూ.. అంతా బాగానే ఉన్నప్పటికీ.. ప్రవీణ్ ప్రకాష్.. సీఎంవోలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఆయనపై ఏకంగా వేటు పడింది. అధికారవర్గాలపై జగన్మోహన్ రెడ్డి .. పూర్తిగా పట్టు కోల్పోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయన్న అభిప్రాయం ఏర్పడుతోంది.