అక్రమాస్తుల కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పిటిషన్ను సీబీఐ కోర్టు కొట్టివేస్తూ… హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా చేసినట్లుగా తెలుస్తోంది. తీర్పు పత్రాలు.. సోమవారం బయటకు వచ్చాయి. గతంలో.. ఓ సారి హైకోర్టు మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించిన విషయాన్ని సీబీఐ కోర్టు తీర్పులో ఉదహరించారు. దాని వల్ల సీబీఐ కోర్టు తీర్పుపై.. హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా.. జగన్ తరపు న్యాయవాదులకు లేకుండా పోయిందని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. హైకోర్టు కంటే.. ఉన్నత న్యాయస్థానం.. సుప్రీంకోర్టు కాబట్టి.. సుప్రీంకోర్టులోనే తదుపరి పిటిషన్ వేయాల్సి ఉంటుంది. కోర్టు తీర్పు ప్రతి చూసి.. హైకోర్టులో పిటిషన్ వేసి.. కనీసం స్టే తీసుకుని.. సీఎం హోదాలో జగన్.. సీబీఐ కోర్టుకు వెళ్లకుండా చూసేందుకు ఆయన తరపు న్యాయవాదులు ఉత్కంఠగా ఎదురుచూశారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిందేనని తేలడంతో డీలా పడ్డారు.
సీబీఐ కోర్టు, హైకోర్టు .. జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ వాదనను సమర్థించి.. వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్లను కొట్టివేసినప్పుడు.. సుప్రీంకోర్టు కూడా.. సానుకూలంగా స్పందించే అవకాశం తక్కువ. ఇలాంటి పిటిషన్లు విచారణకు రావడానికి సమయం పడుతుంది. అందుకే.. జగన్మోహన్ రెడ్డి వర్గాలు.. సీబీఐ కోర్టు తీర్పుతో డీలా పడినట్లుగా తెలుస్తోంది. మహా అయితే.. ఒకటి, రెండు వారాలు వ్యక్తిగత, అధికారిక కారణాలు చెప్పి… కోర్టుకు డుమ్మా కొట్టవచ్చు కానీ.. ఇక వరుసగా అంటే.. సాధ్యం కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎలా చూసినా.. ఆరు నెలల విరామం తర్వాత ఈ శుక్రవారం జగన్మోహన్ రెడ్డి కోర్టు మెట్లెక్కక తప్పని పరిస్థితి ఉంది.
వరుసగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు.. పాలనా పరమైన చిక్కులతో.. జగన్ ఇప్పటికే.. ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ సమయంలో.. వ్యక్తిగతంగా అక్రమాస్తుల కేసు కూడా ఆయనను చిక్కుల్లో పడేస్తోంది. పాలనా పరంగా పరిష్కరించాల్సిన సమస్యలను.. ఆయన.. వాటంతటకి అవే తగ్గిపోతాయన్న ధీమాతో ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి హోదాలో.. కోర్టు మెట్లెక్కడమే.. అతి పెద్ద ఇబ్బందిగా మారింది. దీన్ని తప్పించుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.