విజయశాంతి దాదాపు పుష్కర కాలం తరవాత కెమెరా ముందుకు వస్తోంది. `సరిలేరు నీకెవ్వరు` తో. ఈ సినిమా కోసం రాములమ్మ షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకుంది. అది ఎంత అనేది చిత్ర బృందం కూడా చెప్పడం లేదు. కాకపోతే.. రెమ్యునరేషన్ టెంప్ట్ చేయడం వల్లే విజయశాంతి ఈ ఆఫర్ ఒప్పుకుందని సమాచారం. దానికి తగ్గట్టుగానే విజయశాంతి పాత్రకు చాలా ప్రాధాన్యం ఇచ్చి, ఆ పాత్రని చాలా శక్తిమంతంగా తీర్చిదిద్దుతున్నారు.
విజయశాంతి కూడా ఈ సినిమా పై చాలానే ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా ఫలితం చూశాకే.. నటన కొనసాగించాలా .? లేదంటే మళ్లీ రాజకీయాలతో నే సరిపెట్టుకోవాలా..? అనేవి నిర్ణయించుకోవాలని భావిస్తోంది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయ్యి. .. తన పాత్రకి మంచి పేరు వస్తే… తప్పకుండా నటిగా మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి. ఇప్పటికే కొంతమంది దర్శకులు విజయశాంతి కి తగిన పాత్రలు సిద్ధం చేస్తున్నారు కూడా. కాకపోతే విజయశాంతి పారితోషికం భరించడమే కష్టం. విజయశాంతి రేసులోకి వస్తే, రమ్యకృష్ణ, నదియా, టబు లాంటి వాళ్ళు కూడా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి వుంటుంది. నదియా క్రేజ్ ఇప్పటికే బాగా తగ్గిపోయింది. బాహుబలి తరవాత రమ్యకృష్ణ కీ మంచి పాత్రలు దక్కలేదు. సరిలేరు హిట్ ఐనా ఆ క్రేజ్ ని కాపాడుకోవడం విజయశాంతి కి తలకుమించిన పనే అవుతుంది. మరి ఏం చేస్తుందో… తన కెరియర్ ఎలా మలచుకుంటుందో చూడాలి.