ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఎలక్ట్రిక్ బస్ టెండర్ల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆ బస్సుల టెండర్లను.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌కు..ఈ ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లకు లింక్ ఉందని.. ఉద్ధృతంగా ప్రచారం జరిగింది. పోలవరంలో రూ. ఎనిమిది వందల కోట్ల తక్కువకు టెండర్ వేసినందుకు.. ఆ ఎనిమిది వందల కోట్లను జగన్.. ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో .. మెఘా కంపెనీకి చెల్లించబోతున్నారన్న ప్రచారం జరిగింది. మేఘా గ్రూప్‌నకు చెందిన ఒలెక్ట్రా… ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీకి కిలోమీటర్ రూ. 60కి కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నారని చెప్పుకున్నారు. దీనికి తగ్గట్లుగానే… టెండర్ల ప్రిబిడ్ సమావేశానికి ముందు రోజే… ఆర్టీసీ ఎండీగా ఉన్న సురేంద్రబాబును… బదిలీ చేసి… కృష్ణబాబుకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. దీంతో మరిన్ని అనుమానాలొచ్చాయి.
350 ఎలక్ట్రిక్ బస్సుల కోసం.. పిలిచిన టెండర్ల కోసం… నిర్వహించిన .. ప్రిబిడ్ సమావేశానికి అనూహ్యంగా 18 కంపెనీలు హాజరయ్యారు. ఒలెక్ట్రాతో పాటు.. మరో రెండు, మూడు కంపెనీలు మాత్రమే వస్తాయని… దాంతో.. తాము అనుకున్నధరకు… అనుకున్న వారికి.. కాంట్రాక్ట్ కట్టబెట్టవచ్చని పెద్దలు భావించినట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. ఎలక్ట్రిక్ బస్సుల ఉత్పత్తిలో పేరెన్నిక గన్న… అశోక్ లేలాండ్, టాటా, ఐషర్ సహా… ప్రముఖ కంపెనీలన్నీ ప్రిబిడ్ సమావేశానికి హాజరయ్యాయి. దీంత..ప్రభుత్వం గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక.. బిడ్ల ప్రక్రియను ఎక్కడివక్కడ నిలిపి వేశారు.
లెక్క ప్రకారం.. నవంబర్ ఒకటో తేదీన ఫైనాన్షియల్ బిడ్ నిర్వహించాల్సి ఉంది. ఆరో తేదీన రివర్స్ టెండర్లకు వెళ్లి ధరలు ఖరారు చేయాల్సి ఉంది. ఫైనాన్షియల్ బిడ్‌లోనే.. ఒలెక్ట్రా కంటే.. చాలా తక్కువకు.. కంపెనీలు ధరలు కోట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో.. టెండర్లను రద్దు చేయాలని జగన్ ఆదేశించారు. దీనికి కారణంగా.. న్యాయ సమీక్షకు పంపించాలన్న కారణాన్ని చెబుతున్నారు. టెండర్లను న్యాయ సమీక్షకు పంపించాలంటే.. రద్దు చేయాల్సిన అవసరం ఏముందో.. ఎవరికీ అర్థం కావడం లేదు. తమ లెక్క తప్పిపోయిందన్న కారణంగానే.. టెండర్లు రద్దు చేశారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.