ప్రజాధనం … అర్హులైన వారికే చేలాని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. అమ్మఒడి పథకం పేరుతో… విద్యార్థులను స్కూలుకు పంపే ప్రతి తల్లికి ఏటా రూ. పదిహేను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని జనవరి పదిహేనో తేదీన ప్రారంభించబోతున్నారు. అందుకే.. కచ్చితంగా.. అర్హులైన వారికి… వారి చదువుకు ఉపయోగపడేలా.. మాత్రమే..ఈ పథకాన్ని అందించాలన్న ఆలోచన చేస్తున్నారు. 75 శాతం హాజరు ఉంటేనే…అమ్మ ఒడి పథకం నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇలా చేయడం వల్ల డ్రాపవుట్ పూర్తిగా తగ్గే అవకాశం ఉందని.. అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న పథకం డబ్బుల కోసమైనా.. తల్లిదండ్రులు పిల్లల్ని..బలవంతంగా అయినా.. స్కూలుకు పంపుతారని.. నమ్ముతున్నారు.
ఇప్పటికే.. ఈ పథకం ధనవంతులకు చేరకుండా కట్టడి చేశారు. రేషన్ కార్డు అర్హత కూడా పెట్టారు. అమ్మఒడి పథకంతో.. ఏపీలో అక్షరాస్యత.. స్కూలుకు విద్యార్థుల్ని పంపే తల్లిదండ్రుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని.. ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు కూడా పథకం వర్తింప చేయడం.. మరో కీలకమైన అంశం. ప్రైవేటు స్కూళ్లలో చదివే పిల్లలకు ఇచ్చే అంశంపై…భిన్నమైన వాదనలు జరిగినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి మాత్రం.. ఈ విషయంలో రాజీ పడలేదు.
తాను హామీ ఇచ్చాను కాబట్టి… చేసి తీరాల్సిందేనని పట్టుదలతో ఉన్నారు. అయితే.. కొన్ని ఆంక్షలు పెట్టి.. కేవలం.. ఆర్హులకూ..అదీ నిజంగా.. సాయం అవసరమైన విద్యార్థులకే అందేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీ విద్యావ్యవస్థలో.. ఈ పథకం కీలకమైన మార్పులు తేనుంది. అలాగే.. స్కూళ్లలో మౌలిక వసతులు పెంచేందుకు కూడా జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆరు నెలల్లో మార్పు చూపించబోతున్నారు.