ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతోంది..?
ఎమ్మెల్యేలు పాస్టర్ల సమావేశాలు పెట్టి మత మార్పిళ్లను ప్రోత్సహించండి.. ఎవరడ్డు వస్తారో చూస్తామని హామీలిస్తున్నారు..!
ఆలయాల్లో అన్యమతస్తులను తొలగించినందుకు సీఎస్‌ను సాగనంపేశారు..!
గ్రామ, వార్డు సచివాలయాలు.. మత ప్రచార కేంద్రాలుగా తయారయ్యాయి..!
వీటన్నింటికీ తోడు.. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ.. ముఖ్యమంత్రి సొంత మీడియాలో మత మార్పిడి చేసుకుంటే తప్పేమిటనే ప్రచారం… ఉద్ధృతంగా సాగుతోంది. వీటన్ని.. ఒకదానికి.. ఒకటికి సంబంధం లేనట్లుగా ఉండవచ్చు కానీ.. అంతిమంగా.. ఓ స్కెచ్ ప్రకారమే నడుస్తున్నాయన్న అభిప్రాయం… అన్నింటినీ కలిపి చూస్తే అనిపించకమానదు.
క్రైస్తవంలోకి ఆకర్షించేలా గ్రామ, వార్డు సచివాలయాలు ..!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మత మార్పిళ్లకు ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. చాలా స్వల్ప కాలంలోనే ఈ ఆరోపణలు రావడంతో.. అందరూ.. తొందరపాటు అన్న ఉద్దేశంతో లైట్ తీసుకున్నారు. అయితే.. ఆ ప్రయత్నాలు నిజమేనని ఇప్పుడు నిరూపితమవుతోంది. ఏపీలో మత మార్పిళ్ల ఉద్యమం.. గ్రామ, వార్డు సచివాలాయల నుంచే ప్రారంభమయింది. వాలంటీర్ల ప్రధాన విధుల్లో ఒకటి.. క్రైస్తవాన్ని.. తమకు అప్పగించిన యాభై ఇళ్లకు చేర్చడమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామ, వార్డు కార్యాలయాలను ఇప్పటికే.. క్రైస్తవం వైపు ఆకర్షించేలా.. రూపుదిద్దారు. ఆ కార్యాలయాలకు వచ్చే ప్రజల మనసుల్లో.. చర్చికి వెళ్తున్నామనే భావన కల్పించేలా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
మత మార్పిళ్లకు ఎమ్మెల్యేల ప్రోత్సాహం ..!
కొద్ది రోజుల క్రితం.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాస్టర్లతో సమావేశం పెట్టి.. మతాలను మార్చండి.. ఎవరు అడ్డు వస్తారో చూస్తామన్నట్లుగా భరోసా ఇచ్చిన వీడియో బయటకు వచ్చింది. ఆ తర్వాత జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వంతు. వైసీపీ ఎమ్మెల్యేలందరికీ.. ఇదే రకమైన ఆదేశాలు వెళ్లాయని.. చాలా మంది తమ తమ నియోజకవర్గాల్లో పాస్టర్ల భేటీలు పెట్టి.. మత మార్పిడులకు స్వేచ్చ ఇచ్చారని చెబుతున్నారు. కొంత మంది వీడియోలు మాత్రమే బయటకు వచ్చాయి.. మిలిగిన వారివి గుట్టుగా అయిపోయాయని అంటున్నారు.
రాజకీయంగా పాతుకుపోవడానికి మతం అస్త్రం..!
ఉద్యమంలా మత మార్పిళ్లు ఎందుకనే ప్రశ్నకు.. జగన్ మోహన్ రెడ్డి రాజకీయాలే కారణంగా కనిపిస్తున్నాయి. ప్రభువును ప్రార్థించేవాడు జగన్ కు ఓటేస్తాడన్న … నమ్మకంతోనే… ఈ తరహా మత మార్పిడులకు ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికల సమయంలో.. దాదాపుగా ప్రతీ చర్చిలోనూ.. జగన్ కోసం ప్రార్థనలు జరిగాయి. గిరిజనుల్లో వ్యాప్తం చేసిన క్రిస్టియానిటీ కారణంగానే… ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల విజయాలు సునాయాసం అవుతున్నాయన్న అభిప్రాయం ఉంది. దాన్నే ఇతర నియోజకవర్గాలకు వ్యాప్తం చేసి… రాజకీయంగా పునాదులు గట్టి పరుచుకోవడమే లక్ష్యంగా జగన్ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ దిశగా ఐదు నెలల్లోనే ఆయన ఎన్నో అడుగులు ముందుకేశారని.. తాజాగా వెల్లడవుతున్న విషయాలు..స్పష్టం చేస్తున్నాయి.
Andhra BJP ‘s IT Cell alleges , with video evidence, AP Government offices are being used as Churches : @Sunil_Deodhar @rammadhavbjp @BJP4India https://t.co/0HWkzXfg8Y
— Telugu360 (@Telugu360) November 5, 2019