‘సరిలేరు నీకెవ్వరు’ నిర్మిస్తున్న సంస్థల్లో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒకటి. ఇప్పుడు మహేష్ బాబుతో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యింది. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో మహేష్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లైన్ చెప్పిన ప్రశాంత్ నీల్ – త్వరలోనే మరోసారి నేరేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అది కూడా ఓకే అయిపోతే – ఈ సినిమా పట్టాలెక్కేస్తుంది. ‘కేజీఎఫ్ 2’ ముగిసిన వెంటనే మహేష్‌తో జట్టు కడతాడు నీల్.
‘సరిలేరు…’ తరవాత మహేష్ – వంశీ పైపడిల్లి కాంబో ఒకటి సెట్స్‌పైకి వెళ్లాల్సింది. అయితే… అది కాస్త వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ తో సినిమాకి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలోనూ మహేష్ నిర్మాణ భాగస్వామిగా ఉంటాడట. మరోవైపు వంశీ పైడిపల్లి మాత్రం మహేష్ కోసం కథని తయారు చేయడంలో తలమునకలై ఉన్నాడు. సినిమా పట్టాలెక్కడానికి టైమ్ ఉంది కాబట్టి, వంశీ కాస్త రిలాక్స్ అవ్వొచ్చిప్పుడు.