‘సైరా’ తరవాత సురేందర్ రెడ్డి ఎవరితో సినిమా తీస్తాడు? ప్రభాస్, మహేష్ బాబులకు కథ చెప్పేశాడా? ఇద్దరిలో ఎవరు ఓకే అన్నారు? ఇలా రకరకాల ప్రశ్నలు. ప్రభాస్‌తో అని కొంతమంది, కాదు.. మహేష్‌తో అని ఇంకొంతమంది. కానీ సురేందర్ రెడ్డి ప్లాన్స్ వేరేలా ఉన్నాయి.
సురేందర్ రెడ్డి ప్రస్తుతం చిత్ర నిర్మాణం వైపు దృష్టి పెట్టారన్నది విశ్వసనీయ వర్గాల టాక్. ఆయన సొంతంగా ఓ నిర్మాణ సంస్థను స్థాపించి, కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ రెండు చిత్రాలకూ తనే కథ అందిస్తాడు. దర్శకత్వ బాధ్యత శిష్యులకు అప్పగిస్తాడు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా ప్రొడక్షన్పైనే. పెద్ద పెద్ద హీరోలంతా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వాళ్లంతా సురేందర్ రెడ్డి దగ్గరకు వచ్చేటప్పటికి టైమ్ పడుతుంది. ఈలోగా ఈ రెండు సినిమాల్నీ పూర్తి చేయాలని భావిస్తున్నాడు.