జగన్ చేతిలో అవమానకర రీతిలో ఉద్వాసనకు గురైన.. ఎల్వీ సుబ్రహ్మణ్యం.. సెలవు పెట్టారు. తన తరవాత.. ఇన్చార్జ్ సీఎస్‌గా నియమితులైన.. నీరబ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించి.. ఆయన .. నెల రోజుల పాటు సెలవు పెట్టి వెళ్లిపోయారు. తనకు నిధులు.. విధులు ఉండని… బాపట్లలోని హెచ్ఆర్డీ డీజీగా నియమించినా.. అక్కడ బాధ్యతలు చేపట్టడానికి ఆయన సుముఖంగా లేరు. అందుకే… మర్యాద ప్రకారం.. వచ్చి .. నీరబ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించేసి .. వచ్చే నెల ఆరో తేదీ వరకు సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీపై రాజకీయ రగడ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం కూడా.. ఈ వ్యవహారంపై ఓ కన్నేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఎల్వీ తొలగింపు వెనుక.. క్రిస్టియన్ లాబీ పని చేసిందని.. ఆయన బీజేపీ లైన్ లో పని చేస్తున్నారన్న కారణంగానే.. ఉద్వాసనకు గురయ్యారన్న సానుభూతి.. బీజేపీ పెద్దల్లో ఉందంటున్నారు. అందుకే.. ఆయనను కేంద్ర సర్వీసుల్లోకి తీసుకునే అవకాశం ఉందంటున్నారు. దాని కోసం.. కొంత ప్రక్రియ ఉంటుంది.. కాబట్టి.. ఈ లోపు ఆయనను సెలవు పెట్టుకోమని సలహా ఇచ్చారని తెలుస్తోంది. అందుకే.. తన రిటైర్మెంట్.. మరో ఆరు నెలలు మాత్రమే ఉన్నప్పటికీ.. ప్రభుత్వం బదిలీ చేసిన స్థానంలో విధుల్లో చేరడానికి ఆసక్తి చూపించడం లేదంటున్నారు.
మరో వైపు కొత్త సీఎస్‌గా.. నీలం సహానికి ఏపీ సర్కార్ ఖరారు చేసింది. ఆమెను ఏపీకి పంపాలని.. ఆమె డిప్యూటేషన్ ను క్యాన్సిల్ చేయాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. గతంలో.. తెలంగాణ సర్కార్ నుంచి.. రావాలనుకున్న ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో ఏపీ ప్రభుత్వ వర్గాల్లో టెన్షన్ ఉంది. కానీ నీలం సహాని విషయంలో అలా జరగని భావిస్తున్నారు. అయితే ఆలస్యం అవుతుందేమోనన్న సందేహంలో ఉన్నారు.