ఓ సంస్కరణ అమలు చేయాలనుకున్నప్పుడు.. దాంట్లో ఉన్న సాధకబాధకాలన్నింటినీ చర్చించి.. విశ్లేషించి.. ఆనక నిర్ణయం తీసుకోవడం సంప్రదాయం. తనకు ఏది తోస్తే అది ప్రకటించేసి.. ఆనక.. నియమ, నిబంధనలు సౌకర్యాల గురించి ఆలోచించడం.. అంత తెలివైన పని కాదు. కానీ ఏపీలో.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి.. మొత్తం ఇంగ్లిష్ మీడియమే ఉండాలన్న ప్రభుత్వాధినేత ప్రకటన.. గందరగోళానికి కారణం అవుతోంది. దీనికి సంబంధించి జగన్ ప్రకటన చేసిన తర్వాత అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఈ సమీక్షల్లో… వచ్చే విద్యా సంవత్సరం నుంచి.. ఇంగ్లిష్ మీడియం నిర్వహించడం సాధ్యం కాదని తేల్చారు. దానికి తగ్గట్లుగా మానవ వనరులు లేవని… అందరికీ శిక్షణ ఇప్పించడానికి సమయం సరిపోదని.. గుర్తించారు. దాంతో.. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకే… మొదటగా ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు.
మొదటగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు వచ్చే ఏడాది ఇంగ్లిష్ మీడియం చేయాలని నిర్ణయించారు. అయితే.. తర్వాత వచ్చే ఏడాది ఏడో తరగతి వరకు.. ఆ తర్వాత ఏడాది… ఎనిమిదో తరగతి వరకూ.. ఇంగ్లిష్ మీడియం చేస్తామని మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు.. విద్యాశాఖతో జరిగిన సమీక్షలో.. మొత్తంగా ఆరో తరగతికే పరిమితం చేశారు. ఇంత గందరగోళం నిర్ణయాలు తీసుకోవడంతో.. ఏపీ ప్రభుత్వ విద్యారంగంలోనూ… గందరగోళం ఏర్పడింది. టీచర్లలోనూ ఆందోళన ప్రారంభమయింది. ఓ వైపు.. ఇంగ్లిష్‌పై అంతంతమాత్రం పట్టు ఉన్న ఉపాధ్యాయులే ఎక్కువగా ఉన్నారు. వారందరూ… ఇంగ్లిష్ మీడియం రేంజ్ అందుకోవాలంటే.. అంత తేలిక కాదంటున్నారు.
ప్రభుత్వ హడావుడి నిర్ణయాలపై విద్యారంగ నిపుణులు కూడా.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడానికి తప్ప ఇలాంటివి ఎందుకూ పని రావంటున్నారు. కీలమైన విషయాల్లో ఆయినా.. అందరితో కలిసి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలనే సూచనలు చేస్తున్నారు.