మహారాష్ట్ర రాజకీయాల్లో దశాబ్దాలుగా చక్రం తిప్పుతున్నప్పటికీ.. బాల్‌థాకరే కుటుంబం నుంచి ఒక్కరూ రాజకీయ పదవులు పొందలేదు. చేపడితే.. మహారాష్ట్ర అత్యున్నత పీఠం .. ముఖ్యమంత్రి పదవినే చేపట్టాలనేది.. వారి లక్ష్యం. దాన్ని బాల్ థాకరే చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు.. ఉద్ధవ్ ధాకరే నిజం చేస్తున్నారు. తన కుమారుడు ఆదిత్య థాకరేను.. ముఖ్యమంత్రి పీఠం పై కూర్చోబెట్టేందుకు … అన్ని రకాల ఏర్పాట్లు చేసేసుకున్నారు. పరిస్థితులు కూడా.. కలసి వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ చేతులెత్తేయడంతో… రెండో అతి పెద్ద పార్టీగా ఉన్న శివసేనను గవర్నర్ ఆహ్వానించారు. దీన్నే ఆవకాశంగా తీసుకుంది శివసేన. బీజేపీని కట్టడి చేయడానికి.. శివసేనకు మద్దతిచ్చేందుకు.. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో … ధాకరే కుటుంబం కొద్ది రోజులుగా చర్చలు జరుపుతోంది. ఆ చర్చలు సఫలమైనట్లుగానే కనిపిస్తోంది.
ఎన్సీపీ – కాంగ్రెస్ కలసి పోటీ చేశాయి. ఈ రెండింటిలో ఎన్సీపీ.. ప్రభుత్వంలో చేరడమో.. లేకపోతే.. రెండూ కలిసి శివసేనకు బయట నుంచి మద్దతివ్వడమో చేస్తాయని అంచనా వేస్తున్నారు. ఎన్సీపీ అధినేత ఇప్పటికే.. శివసేనకు భరోసా ఇచ్చారు. ఈ కారణంగా.. ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని.. శివసేన గవర్నర్‌కు సమాచారం ఇవ్వనుంది. గవర్నరే ఆహ్వానించారు కాబట్టి… శివసేన ముందుకు వచ్చింది కాబట్టి… ఇక ప్రమాణస్వీకారం చేయించడం తప్ప.. గవర్నర్‌కు మరో మార్గం లేదు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత. బలనిరూపణ సమయంలోగా.. మిగతా విషయాలను.. చక్కదిద్దుకోవచ్చనని శివసేన నేతలు భావిస్తున్నారు.
ఎన్సీపీ- కాంగ్రెస్ మద్దతుతో.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ.. ఎన్డీఏలో భాగస్వామిగా ఉండటం.. ఏ మాత్రం మంచిది కాదని.. శివసేన నిర్ణయానికి వచ్చింది. అలా ఉంటే.. మద్దతివ్వడానికి ఎన్సీపీ కూడా సిద్ధంగా ఉండకపోవచ్చు. అందుకే.. కేంద్ర కేబినెట్లో ఉన్న శివసేన మంత్రి అరవింద్ సావంత్.. తాను రాజీనామా చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అంటే.. ఎన్డీఏ నుంచి.. అధికారికంగా శివసేన బయటకు వచ్చినట్లు అవుతుంది. ఇది ఎన్డీఏ కూటమిలోనూ.. కీలక మార్పు అవుతుంది. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయం.. రాను రాను.. కీలక మలుపులకు కారణం అవుతోంది.