ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తీవ్ర అస్వస్తతకు లోనయ్యారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వయసు 90 ఏళ్లు. గత కొంతకాలంగా ఆమె శ్వాసకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారు. ఈరోజు తెల్లవారుఝామున ముంబైలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికి ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. హిందీ, తమిళంతో సహా పలు భారతీయ భాషల్లో వేలాది గీతాల్ని ఆలపించారు లతా మంగేష్కర్. 2011లో ఆమెకు మనదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించారు. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు.