ఇసుక కొరత విషయంలో… పవన్ కల్యాణ్… వైసీపీ నేతలపై చేస్తున్న విమర్శల విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా నారాజ్ అయ్యారు. దీనికి కారణం … భాష. పవన్ కల్యాణ్ భాష ఆయనకు నచ్చలేదట. రాజకీయాల్లో సహనం ఉండాలి…భాషమీద పట్టుండాలని చాలా ఆవేశంగా సలహా ఇచ్చారు. ముఖ్యమంత్రి మట్టికొట్టుకుపోతారని.. పవన్ కల్యాణ్ చేసిన విమర్శ.. బొత్సను సూటిగా తగిలినట్లుగా ఉంది. ” మట్టికొట్టుకుపోవడం ఏంటి?…తమాషా చేస్తున్నావా?.. నీకేనా నోరుంది…మాకు లేదనుకుంటున్నావా? అంటూ ఏకవచన సంబోధనతో … షివరైపోయారు. ఇంత కాలం గౌరవం ఇస్తుంటే రోజురోజుకు పెచ్చుమీరిపోతున్నారని… హెచ్చరించారు.
మీ విధానం, మీ ఆలోచన చెప్పండి మాకు అభ్యంతరం లేదు కానీ.. మాట్లాడితే మట్టికొట్టుకుపోవడం, మీ ఇంటికొచ్చి తొక్కతీస్తాం అంటారా? అని బొత్స ఆవేశంగా ప్రశ్నించారు. పవన్ మాటల్లో అహంకారం, అహంభావం కనిపిస్తున్నాయని బొత్స చెప్పుకొచ్ారు. అయితే… పవన్ కల్యాణ్ పై … ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ముగ్గురు పెళ్లారు.. నలుగురో.. ఐదుగురో పిల్లల వ్యాఖ్యలు మాత్రం బొత్సకు కరెక్ట్ అనిపించాయి. పవన్‌పై సీఎం జగన్ వ్యాఖ్యల్లో తప్పులేదని సర్టిఫికెట్ ఇచ్చేశారు. బొత్స తీరు.. తాము తిడతాం..పడాలి.. ఇతరులు అలాంటి భాష మాట్లాడితే మాత్రం.. సహించబోమన్నట్లుగా ఉంది.
ఆ ఆవేశం బాగానే ఉన్నా.. భాష మీద పట్టు ఉండాలని… బొత్స పవన్ కు ఇచ్చిన సలహానే చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. అసలు బొత్స ఏం మాట్లాడతారో.. మీడియా సమావేశాల్లో ఉన్న వారికే సరిగ్గా అర్థం కాదు. రెండు, మూడు సార్లు గుర్తు చేసుకున్న తర్వాతే బొత్స మాటలపై క్లారిటీ వస్తుంది. దీనిపై చాలా మంది సెటైర్లు వేసినా తనది ఉత్తరాంధ్ర అని.. తన భాష అలానే ఉంటుందని.. ప్రాంతీయ కవరేజీ ఇచ్చి.. సర్దుకుంటారు. అలాంటి… పవన్ కల్యాణ్‌కు భాషపై పట్టు ఉండాలని సలహాలిస్తున్నారు. అదే కాస్త.. ఆడ్‌గా ఉందని జనసైనికులు సెటైర్లు వేస్తున్నారు.