ప్రముఖ నటుడు కృష్ణంరాజు అస్వస్తతకు గురయ్యారు. ప్రస్తుతం కేర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. గత రెండు రోజుల నుంచీ ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారని సమాచారం. జనరల్ చెకప్ నిమిత్తం కృష్ణంరాజు ఆసుపత్రికి వచ్చారని, ప్రతీనెలా ఇది మామూలే అని కృష్ణంరాజు వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. అయితే ఆయన నిమోనియోతో బాధపడుతున్నారని, అందుకు సంబంధించిన చికిత్సే ప్రస్తుతం జరుగుతోందని తెలుస్తోంది. రెబల్ స్టార్‌గా కృష్ణంరాజుకు మంచి పేరుంది. ఆయన చేసినవన్నీ యాక్షన్ సినిమాలే. సెంటిమెంట్ చిత్రాల్లోనూ నటించి పేరు తెచ్చుకున్నారు. గోపీకృష్ణ మూవీస్ పతాకంపై సినిమాల్నీ నిర్మించారు. ప్రభాస్ కొత్త సినిమా ‘జాన్’ గోపీకృష్ణ బ్యానర్‌లోనే తెరకెక్కుతోంది.