సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గొగోయ్ రిటైర్మెంట్కు ముందు వెలువరిస్తున్న సంచలన తీర్పుల్లో ఒకటి రాఫెల్. దీనిలో,.. కేంద్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై క్లీన్చిట్ ఇవ్వడాన్ని సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లను జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టి వేసింది. రాఫెల్ ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ అవసరంలేదని స్పష్టం చేసింది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు 2018 డిసెంబర్ 14న తీర్పు వెలువరించింది. దానిపై… కొంత మంది రివ్యూ పిటిషన్లు వేసారు.
సుప్రీంకోర్టు మొదటి నిర్ణయం తర్వాత రాఫెల్ డీల్లో.. పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని.. ప్రధానమంత్రి కార్యాలయం నేరుగా జోక్యం చేసుకుందని… హిందూ పత్రిక.. కొన్ని ఆధారాలను బయట పెట్టింది. ఆ ఆధారాలను.. చూపుతూ… రాఫెల్ స్కాం విషయంలో.. తీర్పును పునస్సమీక్షించాలని… మాజీ బీజేపీ నేతలు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి పిటిషన్ వేశారు. అంతకు ముందు.. కేంద్రం ఇచ్చిన సమాచారం ప్రకారం.. రాఫెల్ డీల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టించిందని… తప్పుడు సమాచారం ఇచ్చిందని చెబుతూ.. హిందూ పత్రిక బయట పెట్టిన ఆధారాలతో…రివ్యూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై వాదన సమయంలో… రక్షణ శాఖ కార్యాలయం నుంచి.. రాఫెల్ పత్రాలు చోరీ అయ్యాయని.. కేంద్రం వాదిరించింది. దొంగతనానికి గురైన పత్రాలు.. సాక్ష్యాలుగా పరిగణించకూడదని… కేంద్రం తరపున న్యాయవాదులు వాదిరించారు. కానీ… ఆ పత్రాలు దొంగతనానికి గురయ్యాయా.. లేదా అన్నదాని కన్నా.. అసలు ఆ పత్రాలు నిజమా .. కాదా .. అన్న అంశం ఆధారంగానే విచారణ చేయాలని రివ్యూ పిటిషన్ వేసిన వారు వాదించారు.
రాఫెల్ పత్రాలు.. ఓ సారి దొంగతనానికి గురయ్యాయని..మరోసారి.. కాలేదని.. కేంద్రం తరపున వాదించింది. ఈ వాదనలను విన్న సుప్రీంకోర్టు.. పత్రాల మెరిట్ ఆధారంగానే విచారమ జరుపుతామని ప్రకటించింది. వాటిని సాక్ష్యాలుగా తీసుకోకూడదన్న… కేంద్రం వాదనను తోసి పుచ్చింది. రాఫెల్ డీల్ విషయంలో.. అనేక అవకతవకాలు జరిగాయని.. దేశానికి పెద్ద ఎత్తున నష్టం కలిగేలా.. నిబంధనలు మార్చారని..నిపుణులు చాలా కాలం నుంచి ఆరోపిస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం.. అసలు అవినీతే జరగలేదని చెబుతోంది. అయితే.. ఏ విషయంలోనూ పాదరదర్శకత లేదన్న విమర్శలు ఇతర పక్షాల నుంచి వచ్చాయి. అయినప్పటికీ.. సుప్రీంకోర్టు.. తమ పర్యవేక్షణలో సీబీఐ విచారణ అవసరం లేదని తేల్చిచెప్పింది.