ఓ వైపు మత ముద్ర వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం.. కావాలని చేస్తున్నట్లుగా కావాలని వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. గుంటూరు నందివెలుగు రోడ్డులోని కొల్లి శారదా మార్కెట్ ఎదురుగా ఉన్న కనకదుర్గమ్మ దేవాలయాన్ని… కార్పొరేషన్ సిబ్బంది కూల్చివేశారు. రాత్రి సమయంలో ప్రొక్లైనర్ల సాయంతో.. దేవాలయాన్ని నేలమట్టం చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేదు. ఏళ్ల నాటి దేవాలయాన్ని కూల్చడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ తీరుపై హిందూసంఘాలు భగ్గుమంటున్నాయి.
సహజంగా ఆలయాలను తొలగించడానికి ఓ పద్దతి ఉంటుంది. తప్పనిసరిగా తొలగించాల్సి వస్తే.. దాని ప్రకారం.. మూల విరాట్‌ను శాస్త్రోక్తంగా తీసి… ఆలయాన్ని తొలగించడానికి ఏర్పాట్లు చేస్తారు. కానీ… అధికారులు.. ఓ అక్రమ కట్టడాన్ని తొలగించినట్లుగా.. అర్థరాత్రి తొలగిచేశారు. ఇలా.. ఇతర మతాల ప్రార్థనామందిరాల పట్ల వ్యవహరించగలరా.. అని.. హిందూత్వవాదులు ప్రశ్నిస్తున్నారు. తొలగించిన విధానం కూడా అభ్యంతరకరంగా ఉంది. క్రిస్టియన్ ముద్రలు ఉన్న… ఓ బుల్ డోజర్‌ను తీసుకు వచ్చి.. దానితోనే.. పూర్తిగా ఆలయాన్ని నేలమట్టం చేశారు.
ఇదంతా ప్రభుత్వ పెద్దలకు తెలుసనే ప్రచారం జరుగుతోంది. ఓ ఆలయాన్ని తొలగించాలంటే.. కింది స్థాయి సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయం తీసుకోరు. అదీ కూడా.. చిన్న ఆలయం కాదు.. ఓ స్థాయిలో ఉన్న ఆలయమే. అయినప్పటికీ.. రాష్ట్రంలో మత కల్లోలాల తరహాలో.. ఓ అలజడి రేపడానికి జరిగిన ప్రయత్నంగా భావిస్తున్నారు. దీనిపై హిందూ సంఘాలు ఆందోళనలకు దిగాలని నిర్ణయించుకున్నాయి.