ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అక్కడ ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన గురించి ఏముకుంటున్నారో… కొన్ని పేపర్ క్లిప్పింగ్‌లతో క్లుప్తంగా ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి రెండు కాళ్లను.. ఇసుక బస్తాల్లో వేసి.. మూటకట్టుకుని భారంగా నడుస్తున్న కార్టూన్‌ను.. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన.. జనసేనని.. ఢిల్లీలో .. జగన్ పాలన గురించి అనుకుంటోంది అదేనని క్లారిటీ ఇచ్చారు. 175 అసెంబ్లీ స్థానాలున్న అసెంబ్లీలో 151 అసెంబ్లీ స్థానాలలో ప్రజలు గెలిపిస్తే … వచ్చిన ఐదు నెలలు లోనే 35 లక్షల భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని తీసివేసి ఏభై మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయేలా చేసిన ఘనత వైసీపీకే దక్కిందని పవన్ విరుచుకుపడ్డారు.
అలాగే అమరావతి అంశంపై మరో ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రికలో వచ్చిన ఎడిటోరియల్ ఆర్టికల్‌ను పవన్ ట్వీట్ చేశారు. ” జగన్ రెడ్డి ” ఏపీలో తప్పుడు రాజకీయాలు చేస్తున్నారన్న విషయాన్ని జాతీయ మీడియా నిర్మోహమాటంగా చెబుతోందన్న అర్థంలో.. ఆ ఎడిటోరియల్‌కు కామెంట్ పెట్టారు. ఢిల్లీ వెళ్లే ముందు పవన్ కల్యాణ్… అమరావతి గురించి మాట్లాడారు. అమరావతిని ఎక్కడ కడతారో చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం నుంచి చాలా రోజులుగా స్పందన లేదు. అసలు ప్రభుత్వానికే.. క్లారిటీ ఉందో లేదో… ప్రభుత్వంలోని పెద్దలకే తెలియడం లేదు.
పవన్ కల్యాణ్ ఢిల్లీలో కొంత మంది కీలక నేతల్ని కలిసినట్లుగా ప్రచారం జరుగుతోంది. తన పర్యటనకు ఎక్కడా మీడియా హైప్ రాకుండా పవన్ కల్యాణ్ జాగ్రత్త పడుతున్నారు. ఎవర్ని కలుస్తున్నారనేది.. సీక్రెట్‌గానే ఉంచుతున్నారు. ప్రభుత్వంలోని పెద్దల్ని కలిస్తే మాత్రం. మీడియాకు సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. పవన్ ఢిల్లీ పర్యటన వైసీపీలోనూ కాక రేపుతోంది. చంద్రబాబే.. ఢిల్లీకి పంపారంటూ.. అంబటి రాంబాబు లాంటి నేతలు.. అవసరం లేకపోయినా.. ఆరోపణలు చేస్తూ… పవన్ ఢిల్లీ పర్యటనపై తమ ఆందోళనను.. బహిరంగంగానే బయట పెట్టుకుంటున్నారు.