జగన్మోహన్ రెడ్డి తనను నిర్లక్ష్యం చేయకుండా… ఆయనపై అమితమైన అభిమానాన్ని ఇప్పటి వరకూ ఉన్న పార్టీపై అసహ్యమైన ఆరోపణల్ని చేసిన.. వల్లభనేని వంశీ అనుకున్నది సాధించినట్లుగా చెబుతున్నారు. వంశీని ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే.. తన క్యారెక్టర్ మీద మచ్చ పడుతుందన్న ఉద్దేశంతో.. జగన్మోహన్ రెడ్డి ఆయనను పార్టీలో చేర్చుకుని.. గన్నవరం టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రస్తుత గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావును.. జగన్ పిలిపించి మాట్లాడారు. భవిష్యత్‌లో పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని సర్దిచెప్పారు. అంటే దానర్థం… ఇప్పటికి వంశీకే.. నియోజకవర్గాన్ని అప్పచెప్పబోతున్నారని… వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
దీపావళికి ముందు జగన్మోహన్ రెడ్డిని వంశీ కలిశారు. అప్పుడే.. యార్లగడ్డ వెంకట్రావు.. వంశీపై ఫైరయ్యారు. అప్పుడే.. జగన్ పిలిచి మాట్లాడతారని అనుకున్నారు. కానీ జగన్ పట్టించుకోలేదు. చివరికి.. వంశీ… చంద్రబాబు దీక్ష రోజు… ప్రెస్‌మీట్ పెట్టి… జగన్‌పై అమితమైన అభిమానాన్ని చూపారు. అదే నోటితో.. చంద్రబాబును, లోకేష్‌ను తిట్టారు. ఇప్పుడు.. వంశీని కాదంటే… ఇలా రోడ్డు మీద వదిలేస్తారేమోనన్న భయం ఇతర నేతల్లోనూ వెళ్లిపోతుందని.. అలా జరిగితే.. ఎవరూ పార్టీలోకి రారని వైసీపీ వ్యూహకర్తలు భావించారు. అందుకే.. యార్లగడ్డను.. పిలిపించారు.
మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని ఇద్దరూ యార్లగడ్డ వెంకట్రావును తీసుకుని జగన వద్దకు వెళ్లారు. వెంకట్రావు విషయం తాను చూసుకుంటాని జగన్ భరోసా ఇచ్చారు. వెంకట్రావు భవిష్యత్‌పై పూర్తి భరోసా ఇచ్చారు। మీపై నమ్మకం ఉందని జగన్‌తో చెప్పినట్లుగా తెలుస్తోంది. అంటే.. గన్నవరం ను వదులుకోవడానికి యార్లగడ్డ రెడీ అయ్యారని అంటున్నారు. అంతే కాదు.. రెండు రోజుల కిందట… కొడాలి నాని కూడా ఇదే చెప్పారు. కావాలంటే.. యార్లగడ్డకు గుడివాడ ఇచ్చేస్తానని ప్రకటించారు. అంటే.. వంశీకి గన్నవరం ఇచ్చేసినట్లేనన్నమాట..!