పార్టీ లైన్ దాటిపోతే షోకాజ్ నోటీస్ జారీ చేసి.. పార్టీ నుంచి బయటకు పంపుతానని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించి పంపినా… ఎంపీలు లైట్ తీసుకుంటున్నారు. పార్టీ లైన్ కు వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడటమే కాదు.. విజయసాయిరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశాలకూ డుమ్మా కొడుతున్నారు. ఎపీలు పూర్తిగా… విజయసాయిరెడ్డి కనుసన్నల్లో పని చేయాలని.. జగన్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో ఏం చేయాలో .. చర్చించేందుకు విజయసాయిరెడ్డి.. తన ఇంట్లో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎడెనిమిది మంది ఎపీలు డుమ్మాకొట్టారు. పార్లమెంట్ సమావేశాల కోసమే ఢిల్లీ వెళ్లిన ఎంపీలు.. విజయసాయిరెడ్డిని ఇంత లైట్ తీసుకోవడం.. చాలా మందిని ఆశ్చర్య పరిచింది.
సమావేశంలో పాల్గొన్న వారు కూడా.. సైలెంట్ గా లేరు. విజయసాయిరెడ్డి మీద ఫైరయ్యారు. తమ తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మాటే చెల్లుతోందని.. తమకు ఎలాంటి అధికారాలు లేవని.. ఫైరయ్యారు. జగన్ .. ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని.. అలాంటప్పుడు.. తమ పదవి వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలతో సమానంగా తమకూ.. అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతీ పనికి ఎమ్మెల్యేల అనుమతి తీసుకోవడం… ఏదైనా చేయాలంటే..వారు అడ్డుపడటం సహజంగా మారిపోయిదన్నారు. జగన్తో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు కాబట్టి.. ఈ విషయాలన్నింటినీ విజయసాయిరెడ్డినే… ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీలు కోరారు. ఇటీవలి కాలంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలతో.. జాతీయ స్థాయిలో జగన్ పాలనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని ఎంపీలు అభిప్రాయపడ్డారు. అందుకే.. జగన్ ప్రభుత్వ విధానాలను జాతీయంగా ప్రచారం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఎంపీలకు విజయసాయిరెడ్డి సూచించారు.
వైసీపీకి ఇరవై రెండు మంది లోక్ సభ ఎంపీలు ఉన్నారు. వీరిలో కొందరు.. కేంద్రమంత్రులతో సన్నిహిత సంబంధాలు పెంచుకుని బీజేపీకి దగ్గరవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కొంత మంది ఎంపీల పేర్లూ ఈ ప్రచారంలోకి వచ్చాయి. ఇలాంటి సమయంలో.. విజయసాయిరెడ్డితో భేటీకి పలువురు ఎంపీలు డుమ్మాకొట్టడం… ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది.