తెలుగుదేశం పార్టీ ఎంపీలకు.. కేంద్ర పెద్దలు అనూహ్యంగా ప్రాముఖ్యత ఇస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానిని.. రోడ్డురవాణా, షిప్పింగ్ మంత్రిత్వశాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా…నియమించారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నితిన్ గడ్కరీతో… కేశినేని సన్నిహితంగా ఉంటారు. టీడీపీ హయాంలో.. నితిన్ గడ్కరీ సాయంతో.. విజయవాడకు అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాగపూర్ వెళ్లి అభినందించి వచ్చారు కూడా.అయితే వ్యక్తిగతంగా సన్నిహితుడయినంత మాత్రాన.. పదవి ఇచ్చే అవకాశం లేదు.
కేశినేని నానికి పదవి ఇవ్వడానికి ఒక్క రోజు ముందే.. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ కు.. కూడా.. కీలకమైన పదవి దక్కింది. ఆయన అమిత్ షా టీంలోనే చోటు దక్కించుకున్నారు. కేంద్ర హోంశాఖ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా చైర్మన్గా వ్యవహరిస్తున్న ఈ కమిటీలో టీడీపీ ఎంపీకి అవకాశం కల్పించడం ఎవరూ ఊహించనిది.
టీడీపీ, బీజేపీల మధ్య రాజకీయంగా సత్సంబంధాలు ఇటీవలి కాలంలో అంతగా లేవు. అయినప్పటికీ.. లోక్ సభ నుంచి కేశినేని నానికి.. రాజ్యసభ నుంచి… కనకమేడల రవీంద్రకుమార్ కు.. పదవులు ఇచ్చారు. సాధారణంగా.. ఎలాంటి కమిటీల్లో అయినా… అంతో ఇంతో… సఖ్యతగా ఉండే వారికే.. పదవులు ఇస్తూ ఉంటాయి.. ప్రభుత్వాలు. ఇప్పుడు.. టీడీపీ ఎంపీలకు.. అదీ కూడా.. రాజ్యసభలో ఇద్దరు.. లోక్సభలో ముగ్గురు మాత్రమే ఎంపీలు ఉన్నప్పటికీ.. బీజేపీ ప్రాధాన్యం కల్పిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఇదే హాట్ టాపిక్..!