పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సారి హల్లో విజయ్ గారూ.. అంటూ.. విజయసాయిరెడ్డిని పలకరించిన … ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. ఈ సారి ఆ చాన్స్‌ను.. మరో వైసీపీ ఎంపీ… రఘురామకృష్ణంరాజుకు ఇచ్చింది. పార్లమెంటు సెంట్రల్ హాల్ దగ్గర ఎంపీ రఘురామ కృష్ణంరాజును… అటుగా వెళ్తున్న ప్రధాని మోడీ.. ఆగి మరీ పలకరించారు. ఆప్యాయంగా మాట్లాడారు. రఘురామ కృష్ణంరాజుతో కరచాలనం చేసి భుజం తట్టారు. మోడీకి.. రఘురామకృష్ణంరాజు శిరస్సు వంచి నమస్కరించారు. అంతా బాగుందా అంటూ రఘురామకృష్ణంరాజును మోడీ క్షేమాచారాలు అడిగారు. ఆ తర్వాత వెళ్లిపోయారు. ఆ సమయంలో.. రఘురామకృష్ణంరాజు పక్కన ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఇతర ఎంపీలు కూడా ఉన్నారు.
కానీ వారెవరిపై మోడీ చూడలేదు. వారు కూడా.. మోడీని పలకరించే సాహసం చేయలేదు. విజయసాయిరెడ్డికి తెలియకుండా.. ఎవరూ ప్రధాని మోడీని కలిసే ప్రయత్నం చేయకూజదని.. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేసి మరీ ఎంపీల్ని ఢిల్లీకి పంపించారు. పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడకూడదన్నారు. అయితే.. రఘురామకృష్ణంరాజు.. ఇంగ్లిష్ మీడియం విషయంలో పార్టీ లైన్ కు వ్యతిరేకంగా మాట్లాడారు. జగన్ సీరియస్ అయ్యాడని మీడియాలో జరిగిన ప్రచారంతో రివర్స్ ఎటాక్ చేశారు. అయితే.. ఇంత వరకూ.. వైసీపీ పెద్దలు రఘురామకృష్ణంరాజును వివరణ కూడా అడగలేదు. ఈ లోపే ఆయనకు.. నరేంద్రమోడీ.. ఎక్కడ లేని బలం ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ అగ్రనాయకత్వం.. రఘురామకృష్ణంరాజుపై.. కనీసం కోపంగా చూసే పరిస్థితి లేదు.
బీజేపీ పెద్దలను కలవకుండా.. ఎంపీలను కట్టడి చేశారన్న ప్రచారం.. ప్రధాని మోడీ వద్దరు చేరిందని.. అందుకే ఆయన.. ఆగి మరీ… రఘురామకృష్ణంరాజును పలకరించారన్న ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది. ఎంపీగా గెలిచాక తొలి సమావేశాల్లోనే కుటుంబసమేతంగా.. మోడీతో సమావేశమయ్యారు. కొన్ని పుస్తకాలను బహుకరించారు. కేంద్రమంత్రులతోనూ సన్నిహితంగా ఉంటున్నారు. ఈ కారణంగా ఆయనకు వైసీపీ సిఫార్సు చేయకపోయినా.. ఓ పార్లమెంటరీ స్థాయీ సంఘం చైర్మన్ పదవి లభించిందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు.. విజయసాయికన్నా.. రఘురామకృష్ణంరాజే..మోడీ దగ్గర పాపులయ్యారని తాజా పరిణామాలతో తేలింది.