సభా సంప్రదాయాలు తెలియకుండా.. వ్యవహరించి… నవ్వుల పాలవడం.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సహజంగా మారిపోతోంది. పార్లమెంట్ సమావేశాల కంటే ముందే నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో.. జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం గురించి ప్రస్తావించి.. అమిత్ షాతో అక్షింతలు వేయించుకున్నారు. ఇతర పార్టీల నేతలు.. కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా జరిగిందని… టీడీపీ సభ్యులు బయట మీడియాకు చెప్పారని.. ఆ విషయాలను మీడియా రాసిందని.. ఆయన ఏకంగా సభా హక్కుల నోటీసు ఇచ్చారు. ఈ నోటీసు చూసి రాజకీయవర్గాలన్నీ.. మరోసారి నవ్వుకుంటున్నాయి. సభబయట జరిగిన విషయాన్ని తీసుకొచ్చి సభా హక్కుల నోటీసులు ఇవ్వడమేమిటని ప్రశ్నిస్తున్నాయి.
ఇదొక్కటే.. కాదు విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రతీసారి నవ్వుల పాలవుతోంది. తొలి రోజు రాజ్యసభలో.. ఆయనపై వెంకయ్యనాయుడు మండిపడ్డారు. జీవో అవర్ లో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూండటంతో.. వెంకయ్యనాయుడు.. రూల్స్ వివరించి.. అన్నీ తెలుసుకుని రావాలని మందలించారు. దాంతో.. విజయసాయిరెడ్డి సైలెంట్ గా కూర్చోవాల్సి వచ్చింది. విజయసాయిరెడ్డి పలు సందర్భాల్లో.. నిబంధనలకు విరుద్ధంగా.. తాను అన్నింటికీ అతీతుడ్నన్నట్లుగా వ్యవహరిస్తూంటారన్న చర్చ పార్లమెంట్ లాబీల్లో జోరుగా సాగుతోంది.
ఆయన పదే పదే అభాసు పాలవుతున్నా.. తనదే పైచేయి అని చెప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు.. మరింతగా.. ఆయన పై జాలి కలిగేలా చేస్తున్నాయంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. వైసీపీ తరపున..పీఎంవోలనూ పలుకుబడి సాధించిన ఆయన ఇప్పుడు.. కనీసం.. ఓ కేంద్రమంత్రి అపాయింట్మెంట్ కూడా పొందలేకపోతున్నారు. అధికారం అందిన ఉత్సాహంలో ఆయన చేసిన పొరపాట్లే దీనికి కారణం అంటున్నారు. దీనిని తెలుసుకోకుండా..ఇంకా ఇంకా విజయసాయిరెడ్డి గీత దాటిపోతున్నారన్న చర్చ జరుగుతోంది.