భారతదేశం కొత్త మ్యాప్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అమరావతిని గుర్తించలేదని.. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.. పార్లమెంట్ లో ప్రశ్నించడంతో.. వెంటనే.. దీన్ని గుర్తించి.. సవరించి.. అమరావతిని గుర్తించి మ్యాప్ ను విడుదల చేసినట్లుగా.. హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ మేరకు మ్యాప్ ను కూడా ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్‌ను రెండుగా విభజించి.. లద్ధాఖ్, జమ్మూలను ఏర్పాటు చేసిన సందర్బంగా.. కేంద్ర ప్రభుత్వం ఇండియా కొత్త మ్యాప్‌ను అధికారికంగా విడుదల చేసింది. అందులో అన్ని రాష్ట్రాలను.. వాటి రాజధానులను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌ను గుర్తించారు కానీ.. ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిని మాత్రం గుర్తించలేదు. ఏపీకి రాజధాని లేనట్లుగా అలా వదిలేశారు.
మ్యాప్‌లో ఇందులో 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాజధానిని చేర్చిన కేంద్ర ప్రభుత్వం.. ఏపీ రాజధాని అమరావతిని మాత్రం చేర్చలేదు. అసలు మ్యాప్‌లో ఎందుకు అమరావతిని గుర్తించలేదన్న దానిపై భిన్నమైన వాదనలు చర్చలు ఇప్పటి వరకూ నడిచాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణాన్ని నిలిపివేస్తున్నట్లుగా కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నామంటూ.. చెప్పుకొచ్చినట్లుగా ఢిల్లీ వర్గాలు చెప్పాయి. దానికి తగ్గట్లుగా ఏపీ మంత్రులు కూడా.. అమరావతిపై రకరకాల విమర్శలు చేశారు.
కొద్ది రోజుల కిందట.. రాజధానిని మార్చేందుకు ఓ కమిటీని కూడా నియమించారు. ఇలాంటి సమయంలో… కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా.. అధికారిక మ్యాప్‌లో అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ.. ప్రకటన చేసింది. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన… రాజదాని.. మార్చే అవకాశం లేదని.. కేంద్రం.. స్పష్టమైన సూచలను.. మ్యాప్‌ను అప్ డేట్ చేయడం ద్వారా పంపినట్లుగా భావిస్తున్నారు.