రంగుల రాజకీయంలో రాటుదేలిపోతోంది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కూల్చివేతలు.. తప్ప.. ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. కానీ.. కనిపించిన ప్రతీ వాటికి.. తమ పార్టీ రంగులు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో.. శ్మశానాలు.. సమాధులనూ వదిలి పెట్టడం లేదు. ఇక జాతీయ పతాకాన్ని, జాతిపిత విగ్రహాలనూ వదలడంలేదు. వాటి ప్రాముఖ్యత.. వాటికి ఇవ్వాల్సిన గౌరవంపై.. వైసీపీ నేతలకు అవగాహన లేదు కాబట్టి.. వాటికీ రంగులేస్తున్నారు. ఇతర పార్టీల నేతలు.. వాటిని వీడియో తీసి.. వైరల్ చేస్తున్నారు. ఈ పరువు తక్కువ పనుల నుంచి తమను తాము కాపాడుకోవడానికి వైసీపీ నేతలు.. వెంటనే రంగులు మార్చేస్తున్నారు. ఊసరవెల్లి తరహాలో.. రంగులు మార్చే రాజకీయాలకు సిద్ధమవుతున్నారు.
కొద్ది రోజుల క్రితం.. అనంతపురం జిల్లాలో .. జాతీయ పతాకాన్ని తుడిచేసి.. వైసీపీ రంగులేశారు. జాతీయ స్థాయిలో హైలెట్ కావడం… వైసీపీ తీరుపై.. విమర్శలు రావడంతో.. ప్రభుత్వం హుటాహుటిన.. రంగులు మార్చాలని ఆదేశించింది. తూ..తూ మంత్రంగా.. ఈ పెయింట్ వేయడానికి కారణం అంటూ.. ఒకరిద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ వ్యవహారం ఇలా ఉండగానే.. విశాఖ జిల్లాలో.. గాంధీ మహాత్ముని దిమ్మకు వైసీపీ రంగు వేసేశారు. వెంటనే జనసేన పార్టీ నేతలు.. దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వైసీపీకి ఇదేం పోయేకాలమని..జనం ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. మళ్లీ పరువు పోయే పరిస్థితి రావడంతో.. వైసీపీ రంగంలోకి దిగింది. వెంటనే..ఆ దిమ్మకు తెలుపు రంగు వేయించి.. ఫోటోలు పెట్టి.. జనసేన, టీడీపీ మార్ఫింగ్ ఫోటోలతో ప్రచారం చేస్తున్నారని.. రంగుల మార్పు రాజకీయాన్ని ప్రారంబించింది.
దీనికి జనసేన వెంటనే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వీడియోను.. కూడా.. పోస్ట్ చేశారు. మహాత్ముని దిమ్మకు.. వైసీపీ రంగులు వేసిన వీడియో కూడా వెంటనే వైరల్ అయిపోయింది. ఏపీ సర్కార్ రంగుల పిచ్చి… దాన్ని సరిదిద్దుకునేందుకు పాల్పడుతున్న ఊసరవెల్లి రాజకీయం.. సోషల్ మీడియాలో బట్టబయలయింది. ప్రజలకు ఉపాధి లేకుండా… చేసి… అభివృద్ధి పనులు నిలిపివేసి.. ఒక్క రంగులు వేసుకుంటూ.. ఏపీ సర్కార్ కాలక్షేపం చేస్తోంది. ఈ క్రమంలో.. అనేక సార్లు వివాదాస్పదంగా వైసీపీ తీరు మారుతోంది. ఎప్పటిక్పపుడు ఎదురుదాడికి దిగడమే తప్ప… తప్పును ఒప్పుకోలేని పరిస్థితి వైసీపీ వెళ్లిపోయింది.