గత ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు.. ఏర్పడిన పరిస్థితులే ఇప్పుడు.. కనిపిస్తున్నాయి. అప్పట్లో.. గవర్నర్ .. పూర్తి మెజార్టీ లేకపోయినా.. బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప.. బల నిరూపణకు వారం రోజుల సమయం కోరారు. కానీ గవర్నర్… వారం ఏం సరిపోతుంది.. పదిహేను రోజులు తీసుకోమని చాన్స్ ఇచ్చారు. దీనిపై.. కాంగ్రెస్ – జేడీఎస్ మండిపడ్డాయి. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాయి. అత్యవసరంగా .. విచారణ జరిపిన సుప్రీంకోర్టు యడ్యూరప్ప.. ఒక్క రోజులోనే బలం నిరూపించుకోవాలని ఆదేశించింది. నిరూపించుకోలేక.. యడ్యూరప్ప రాజీనామా చేశారు. ఇప్పుడు మహారాష్ట్ర విషయంలో.. అలాంటిదే రిపీట్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
రాత్రికి రాత్రి.. రాష్ట్రపతిపాలన ఎత్తేసి.. బీజేపీ కి చెందిన ఫడ్నవీస్ తో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. బలనిరూపణకు.. వారం సమయం ఇచ్చారు. కానీ.. ఇదంతా రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తున్న శివసేన – కాంగ్రెస్ – ఎన్సీపీ కూటమి… సుప్రీంకోర్టుకు వెళ్లాయి. తమ ఎమ్మెల్యేలను క్యాంపులకు పంపించి… బలపరీక్షకు వారం రోజుల గడువు వద్దని.. వెంటనే.. బలం నిరూపించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశాయి. సమయం ఇస్తే.. ఎమ్మెల్యేలతో బేరసారాలకు ప్రయత్నిస్తారని.. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వాదిస్తున్నారు.
గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిశీలిస్తే.. వెంటనే బలం నిరూపించుకోవాలని.. ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఆదేశించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం… న్యాయవాద వర్గాల్లో ఉంది. ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్ వెంట.. ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారో.. క్లారిటీ లేకుండా పోయింది. ప్రభావవంతమైన స్థాయిలో అజిత్ పవార్.. ఎన్సీపీని చీల్చలేదన్న విషయం మాత్రం స్పష్టమయింది. దీంతో… నాడు కర్ణాటకలో ఏం జరిగిందో.. ఇప్పుడు.. మహారాష్ట్రలో అదే జరుగుతుందన్న అభిప్రాయం బలపడుతోంది.