ఉదయ్ కిరణ్… మధ్యాహ్నమే అస్తమించిన ప్రతిభావంతుడైన నటుడు. యువకెరటంలా దూసుకొచ్చి.. చప్పున కింద పడ్డ దురదృష్టవంతుడు. ఉదయ్ కిరణ్ అనగానే వరుస హిట్లతో పాటు, ఆటు పోట్లు గుర్తొస్తాయి. చివరి రోజుల్లో ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకున్న దురదృష్టకరమైన ఘటనకళ్ల ముందు మెదులుతుంది. ఇప్పుడు ఈ కథే తెరపైకొస్తుంది. ఉదయ్ కిరణ్ బయోపిక్ కోసం రంగం సిద్ధం అవుతోంది.
ఉదయ్ కిరణ్ గా సందీప్ కిషన్ కనిపించబోతున్నాడు. కథ ఇప్పటి కే సిద్ధమైంది. జనవరిలో లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ చిత్రానికి సందీప్ కిషనే నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. ఉదయ్ కిరణ్ బయోపిక్ తీయాలని చాలామంది అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ధైర్యం చేయలేకపోయారు. కానీ సందీప్ మాత్రం ఈ ప్రయత్నానికి పూనుకున్నాడు. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.