శివసేన- ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి స్టార్ హోటల్లో బలప్రదర్శన చేసింది. 162 మంది ఎమ్మెల్యేలను మీడియా ముందు పరేడ్ చేశారు. వీరందర్నీ.. చూడాలంటూ.. గవర్నర్ కు బహిరంగ ఆహ్వానం పంపారు. ఎమ్మెల్యేల సమావేశానికి ధాకరే , శరద్ పవార్ , మల్లిఖార్జన ఖర్గే, అశోక్ చవాన్ లాంటి ప్రముఖులంతా హాజరయ్యారు. తమ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ… బీజేపీ వైపు వెళ్లడం లేదని.. అందరూ తమతోనే ఉన్నారని.. ఈ మూడు పార్టీలు బలప్రదర్శన చేశాయి. మంగళవారం ఉదయం.. బలపరీక్ష ఎప్పుడు నిర్వహించాలన్నదానిపై.. సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది. ఈ క్రమంలో.. బలపరీక్ష ద్వారా .. గవర్నర్ పై … కూటమి ఒత్తిడి పెంచినట్లుగా భావిస్తున్నారు.
మరో వైపు.. బీజేపీ వైపు చేసిన… అజిత్ పవార్ కు.. ఏసీబీ కేసుల్లో క్లీన్ చిట్ లభించింది. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఇరిగేషన్ కు సంబంధించి రూ. 72 వేల కోట్లు స్కాం చేసినట్లు అజిత్‌పవార్‌పై ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి పలు కేసుల నుంచి.. ఆయనకు విముక్తి కల్పించారు. ఇదంతా.. క్విడ్‌ప్రోకోలో భాగమేనని శివసేన ఘాటుగా విమర్శించింది. కేసులు ఎత్తేస్తూ అజిత్‌పవార్‌కు బీజేపీ గిఫ్ట్ ఇచ్చిందని ఎన్సీపీ కూడా మండిపడింది. మరో వైపు.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఫడ్నవీస్.. అధికారికంగా బాధ్యతలు కూడా స్వీకరించారు. కొన్ని అధికారిక సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే.. అజిత్ పవార్ మాత్రం బయట కనిపించలేదు. ఆయన.. బాధ్యతలు స్వీకరించలేదు.
మహారాష్ట్ర పరిణామాలు.. క్షణక్షణానికి ఉత్కంఠగా మారుతున్నాయి. అజిత్ పవార్.. ఎన్సీపీని చీల్చలేకపోవడం… ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీజేపీ కూడా.. ఆకర్షించలేకపోవడంతో… శివసేన – ఎన్సీపీ – కాంగ్రెస్ తమ బలాన్ని మీడియా ముందు చాటాయి. మంగళవారం.. మహారాష్ట్ర వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.