అవినీతిపై పోరాటం అంటూ.. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను… ఆయనకే రివర్స్ ఎటాక్ కోసం ఉపయోగించుకుంటోంది టీడీపీ. కొద్ది రోజుల కిందట.. ఐఐఎం అహ్మదాబాద్ ప్రతినిధుల్ని.. అమరావతికి పిలిపించిన.. సీఎం జగన్మోహన్ రెడ్డి… ప్రభుత్వ శాఖల్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగే అవకాశం ఉందో… దాన్ని ఎలా నివారించవచ్చో.. పరిశోధన చేసి చెప్పాలని.. ఒప్పందం చేసుకుంది. ఐఐఎం అహ్మదాబాద్‌లో ప్రజా విధానాల విభాగం చీఫ్‌గా ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణస్వామి ఉన్నారు. ఈ విభాగంతోనే ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీనిపై..తెలుగుదేశం పార్టీ రివర్స్ కౌంటర్ ఇచ్చింది. గతంలో తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఏ రకమైన అవినీతికి పాల్పడ్డారో ఆ నమూనాను కూడా అధ్యయనం చేయాలని.. ఐఐఎం అహ్మదాబాద్‌కు టీడీపీ లేక రాసింది.
ముఖ్యమంత్రి అవినీతి చరిత్ర.. నేపథ్యం కూడా తెలుసుకుంటే అధ్యయనానికి మరింత ఉపకరిస్తుందని లేఖలో ఐఐఎం అహ్మదాబాద్ బృందానికి టీడీపీ ఏపీ చీఫ్ కళా వెంకట్రావు తెలిపారు. అవినీతి, క్విడ్ ప్రొ కో ద్వారా జగన్మోహన్రెడ్డి రూ.43 వేల కోట్లు పోగు చేశారు. అవినీతి విశ్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి జగన్ అవినీతి కేసులను మీరు అధ్యయనం చేయాలని బలంగా సిఫారసు చేస్తున్నామన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి.. అవినీతి ఫిర్యాదులు చేయాలనుకుంటే… వెంటనే ఫిర్యాదు చేయండి అంటూ.. ఓ టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రకటించారు. వెంటనే.. మీడియా సమావేశం పెట్టిన టీడీపీ నేత వర్ల రామయ్య.. ఆ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి.. జగన్మోహన్ రెడ్డి అవినీతిపై ఫిర్యాదు చేశారు. దాన్ని నోట్ చేసుకున్న కాల్ సెంటర్.. ఓ నెంబర్ ఇచ్చి… సెక్రటేరియట్లో ఎవరినైనా కలిసి ఫిర్యాదు చేయమని సలహా ఇచ్చారు.
సీఎం ప్రకటించినట్లుగా తన ఫిర్యాదుపై 15రోజుల్లో చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై… రికార్డెడ్ గానే రూ. 43వేల కోట్ల అవినీతి కేసులున్నాయి. వాటిపై సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. విచారణకు హాజరవకుండా.. జగన్ ..రకరకాల కారణాలు చెబుతున్నారు. అయినా ఆయన.. అవినీతిని అంతమొందిస్తానని..సీరియస్ గా ప్రకటనలు చేసి.. చర్యలు తీసుకుంటూంటే.. టీడీపీ నేతలు మాత్రం కామెడి చేస్తున్నారు.