2019 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలైనా, ఎన్నికల తర్వాత రాజకీయంగా దూకుడు చూపించడంలో పవన్ కళ్యాణ్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. జగన్ పాలనకు 100 రోజులు ముగిసినప్పటినుండి ఇసుక సమస్య విషయంలో, ఇంగ్లీష్ మీడియం విషయంలో, ప్రభుత్వ కార్యాలయాలకు, విగ్రహాలకు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు పార్టీ రంగులు పూసిన విషయంలో, ఇలాంటి అనేక అంశాల విషయంలో ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్, తాజాగా రాయల సీమ పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది.
డిసెంబర్ 1నుండి కడప చిత్తూరు జిల్లాలలో పవన్ కళ్యాణ్ రైతాంగ సమస్యల మీద, ఇతర సమస్యల మీద రాయలసీమ ప్రజలతో , మేధావులతో సమావేశం కానున్నారు. అదే విధంగా రాయలసీమ జిల్లాలలో జనసేన శ్రేణుల పై పెట్టిన అక్రమ కేసుల విషయంలో జనసేన శ్రేణులతో సమావేశం కానున్నారు. అదే విధంగా రాయలసీమ లో జనసేన తరపున పోటీ చేసిన అభ్యర్థుల తో నూ పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.
మరి ఈ రాయలసీమ పర్యటన జనసేన కు ఎంత మేరకు ఉపకరిస్తుందనేది వేచి చూడాలి.
JanaSena Chief Sri @PawanKalyan to tour Rayalaseema from Dec 1 pic.twitter.com/HlvMIWCVyF
— JanaSena Party (@JanaSenaParty) November 26, 2019