రెండ్రోజుల నుంచీ ఉదయ్ కిరణ్ బయోపిక్ అనే వార్త సోషల్ మీడియాలో గట్టిగానే చక్కర్లు కొడుతోంది. ఉదయ్ కిరణ్‌గా సందీప్ కిషన్ కనిపించబోతున్నాడని, ఈ సినిమాకి సందీప్‌నే నిర్మాతగా వ్యవహరిస్తాడని వార్తలొచ్చాయి. వీటిపై సందీప్ స్పందించాడు. ఉదయ్ కిరణ్ బయోపిక్ చేయడం లేదని, ఆ కథతో తనని ఎవరూ సంప్రదించలేదని, ఇప్పట్లో బయోపిక్‌లు చేసే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చాడు.
కాకపోతే.. ఉదయ్ కిరణ్ కథని సినిమాగా తీయాలని ఓ యువ దర్శకుడు కథ పట్టుకుని తిరుగుతున్నాడు. సందీప్ కిషన్ అప్పాయింట్‌మెంట్ కూడా తీసుకున్నాడు. సందీప్‌తో చర్చలు కూడా జరిపాడు. కాకపోతే.. సందీప్ తన నిర్ణయాన్ని ఇంకా తెలియపరచలేదు. ఈ లోగా ఈ వార్తలు బయటకు వచ్చేశాయి. దాంతో సందీప్ కాస్త సీరియస్ అయ్యాడని, అందుకే… ఈ సినిమాని వద్దనుకుంటున్నాడని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి. సందీప్ కాకపోయినా, మరొకరితో ఈ సినిమా చేయాలని ఆ దర్శకుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఉదయ్ కిరణ్ దొరుకుతాడో, లేదో చూడాలి.