‘శ్రీమంతుడు’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని రూపొందించిన కొరటాల శివ తన నెక్స్ట్ మూవీ అదే బేనర్లో ఎన్టీఆర్‌తో చేస్తున్న విషయం తెలిసిందే. ‘జనతా గ్యారేజ్’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో ప్రారంభమవుతోంది.
తమిళ్లో సూపర్ డూపర్‌హిట్ మూవీగా నిలిచిన ‘తని ఒరువన్’ చిత్రాన్ని రామ్‌చరణ్‌తో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కూడా ఫిబ్రవరి 22నే ప్రారంభమవుతోంది.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి ఇద్దరు టాప్ హీరోలతో ఇద్దరు టాప్ డైరెక్టర్స్ చేస్తున్న ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఒకేరోజు ప్రారంభమవడమే కాదు, రెండు సినిమాలనూ ఒకేరోజు రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అవ్వడం కూడా విశేషమే. ఆగస్ట్ 12న ‘జనతా గ్యారేజ్’ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని దర్శకనిర్మాతలు భావిస్తుండగా, అదేరోజు రామ్‌చరణ్ చిత్రాన్ని కూడా రిలీజ్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు దర్శకనిర్మాతలు. దాదాపు ఆర్నెల్లు ముందుగానే రిలీజ్ డేట్‌ని రిజర్వ్ చేసుకున్న ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి పోటీ వుంటుందో గానీ ఈ విషయంలో డిస్కషన్స్ మాత్రం తారాస్థాయికి చేరుకోబోతున్నాయి.