అనుకున్నదే అయ్యింది. వర్మ కొత్త సినిమా `కమ్మరాజ్యంలో కడపరెడ్లు` టైటిల్ మారింది. ఇక మీదట ఈ సినిమాని `అమ్మ రాజ్యంలో కడప బిడ్దలు`గా పిలవాల్సిందే. టైటిల్ మార్చమని సెన్సార్ బోర్డు ఆదేశించడంతో చిత్రబృందం చివరి క్షణాల్లో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాపై ముందు నుంచీ వివాదాలు రేగుతూనే ఉన్నాయి. తమ వర్గాన్ని కించపరిచేలా ఉందని ఓ సామాజిక వర్గం కోర్టులో పిటీషన్ వేసింది. ఈ సినిమాని అడ్డుకోవాలని కేఏ పాల్ లాంటి వాళ్లు కూడా న్యాయపరంగా పోరాడుతున్నారు. అయితే వర్మ మాత్రం ఈ పోరాటాన్ని లైట్ గా తీసుకున్నాడు. ఇప్పుడు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పడంతో వర్మ దిగిరాక తప్పలేదు. అయితే ఇప్పటికే ఈ సినిమాకి కావల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది. పేరు మార్చడం వల్ల ఈ సినిమాపై పెను ప్రభావం ఏమీలేదు. వర్మకి రావాల్సిన లాభం వచ్చేసింది. భుజాలు చరుకుకోవాల్సిన వాళ్లు చరిచేసుకున్నారు. బాక్సాఫీసు రిజల్టే బాకీ.