జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఎప్పటి లాగానే మరోసారి సెటైర్స్ వేశారు వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి. డిసెంబర్ 1 నుండి పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన నేపథ్యంలో పవన్ పర్యటనని వీధి ప్రదర్శనతో పోలుస్తూ ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి.
ఆయన ట్వీట్ చేస్తూ, “సినీ నటుడు వస్తున్నాడంటే నలుగురు పోగవుతారు. తమాషా చూద్దామని జనం వస్తే అర్థం పర్థం లేని డైలాగులు దంచుతాడు. పార్టీ నిర్మాణం లేదు, రెండు చోట్లా చిత్తుచిత్తుగా ఓడిపోయాడు. ఒక ఎమ్మెల్యే ఉన్నా లేనట్టే. ప్యాకేజి కోసం వీధి ప్రదర్శనలిస్తున్నాడు. సానుభూతి చూపడం మినహా ఏం చేస్తాం.” అంటూ వ్రాసుకొచ్చారు.
అయితే, నెటిజన్లు విజయసాయి రెడ్డి మీద, ఆయన ట్వీట్ మీద కౌంటర్స్ వేశారు. ఆ సినీ నటుడిని రోజుకి ఒక్కసారైనా తలచుకోకుండా ఉండలేక పోతున్నారు రెడ్డి గారు అని కొందరు ట్వీట్ చేస్తే, 22 మంది ఎంపీలు ఉండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాం అని ఓట్లు వేయించుకుని, ఇప్పుడు కేంద్రం ముందు మెడలు వంచుకుని చేతులు కట్టుకుని నిలబడ్డారు మీరు అంటూ మరి కొందరు చురకలు అంటించారు. ఇంకొందరు అయితే అవినీతి కేసుల లో ఏడాది జైలు కి వెళ్లి వచ్చిన మీరు అవతలి వాళ్ళని విమర్శించే ముందు ఒక సారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని హితవు పలికారు.
ఏది ఏమైనా, పవన్ కళ్యాణ్ డిసెంబర్ 1 నుండి చేపట్టనున్న రాయలసీమ పర్యటన నేపథ్యంలో రెండు వైపుల నుంచి ఈ మాటల తూటాలు మరింత పేలే అవకాశం ఉంది.
సినీ నటుడు వస్తున్నాడంటే నలుగురు పోగవుతారు. తమాషా చూద్దామని జనం వస్తే అర్థం పర్థం లేని డైలాగులు దంచుతాడు. పార్టీ నిర్మాణం లేదు, రెండు చోట్లా చిత్తుచిత్తుగా ఓడిపోయాడు. ఒక ఎమ్మెల్యే ఉన్నా లేనట్టే. ప్యాకేజి కోసం వీధి ప్రదర్శనలిస్తున్నాడు. సానుభూతి చూపడం మినహా ఏం చేస్తాం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 28, 2019