మోషన్ పోస్టర్ అంటే.. ఒకే స్టిల్ అటూ ఇటూ కదుపుతూ జూమ్ అవుట్, జూబ్ బ్యాక్ చేస్తూ, బ్యాక్ గ్రౌండ్లో ఓ థీమ్ మ్యూజిక్ జోడించి వదులుతారు. మోషన్ పోస్టర్ లక్ష్యం, లక్షణం కూడా అదే. అయితే ఇప్పుడు `అశ్వద్ధామ`ని చూస్తే – మోషన్ పోస్టర్ని ఇలాక్కూడా డిజైన్ చేయొచ్చా? అనిపిస్తుంది. నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. రమణతేజ దర్శకుడు. మెహరీన్ కథానాయిక. మోషన్ పోస్టర్ని కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. అయితే ఇదో మినీ టీజర్ లా ఉంది. ఈ కథ థీమ్‌ని చూపిస్తూ… మోషన్ పోస్టర్ని డిజైన్ చేశారు. ఉమెన్ ట్రాఫికింగ్, కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో సాగే సినిమాలా కనిపిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌లా అనిపిస్తోంది. ఈ సినిమాకి నాగశౌర్యనే కథ అందించడం విశేషం. తన సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని రూపొందించారు. `ఛలో`తో ఐరా క్రియేషన్స్ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఆసినిమా బాగా ఆడి, మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది. రెండో ప్రయత్నంగా వచ్చిన `నర్తనశాల` బాగానిరాశ పరిచింది. ఆ బాకీలన్నీ `అశ్వద్ధామ` తీరుస్తాడని నాగశౌర్య ఆశగా ఎదురుచూస్తున్నాడు.