ప్రియాంకరెడ్డి హత్యాచార ఉదంతం… జాతీయ మీడియాను దాటి.. ప్రపంచ మీడియాను తాకింది. ప్రపంచదేశాల్లోని ప్రముఖులు.. సానుభూతి వ్యక్తం చేశారు. దేశంలో కడుపు రగిలిన యువత .. తమకు సాధ్యమైన రీతిలో నిరసన ప్రదర్శనలు చేశారు. చట్టాల్ని.. గిట్టాల్ని పట్టించుకోకుండా.. నిందితుల్ని తక్షణం ఉరి తీసినా… ప్రపంచం మొత్తం … ఆహ్వానించే.. భావోద్వేగం.. ప్రజల్లో కనిపిస్తోంది. షాద్నగర్ దాటి… హైదరాబాద్ దాటి.. తెలంగాణ దాటి… దేశం మొత్తం.. యువత ఊగిపోతోంది. అందరూ.. తమ తమ స్పందన తెలియచేశారు. కానీ.. ఘనత వహించిన తెలంగాణ ప్రభుత్వానికి ఏమైంది..? ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం.. ఎందుకు స్పందించలేదు..? ఇప్పుడు దేశం మొత్తం … చర్చనీయాంశమవుతున్న ప్రశ్న.
ప్రియాంకరెడ్డి హత్యాచారం ఘటనపై కదిలిపోయిన ప్రపంచం..!
ప్రియాంకరెడ్డి హత్యాచారం ఉదంతం వెలుగు చూసిన తర్వాత.. మొట్టమొదటగా.. ప్రభుత్వంపైనే విమర్శలు వచ్చాయి. దానికి కారణం పోలీసుల తీరు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే.. ప్రియాంక తల్లిదండ్రుల పట్ల పోలీసులు వ్యవహరించిన విధానం… బయటకు తెలిసిన తర్వాత.. ఇదే పోలీసింగ్ అనుకోవాల్సిన పరిస్థితి. పోలీసులకు కొత్త వాహనాలు కొనిపెట్టి.. కావాల్సిన అన్నీ సౌకర్యాలు కల్పించామని.. మహిళల రక్షణ కోసం షీటీమ్స్ పెట్టామని… అత్యంత సురక్షిత నగరం హైదరాబాద్ అని.. ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. కానీ.. ప్రియాంకరెడ్డి హత్యాచారం ఘటనతో మొత్తం కొట్టుకుపోయింది. ఇలాంటి సందర్భంలో.. ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరులోనూ.. నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది.
తెలంగాణ ప్రభుత్వాధినేత అంత లైట్ తీసుకున్నారెందుకు..?
ప్రభుత్వం తీరుపై ప్రజాగ్రహం స్పష్టంగా కనిపించింది. ప్రభుత్వం తరపున ప్రియాంకారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు వివాదాస్పద ప్రకటనలు చేశారు. హోంమంత్రి మహమూద్ అలీ ప్రియాంక .. 100కి కాల్ చేయకపోవడాన్ని తప్పు పట్టారు. మంత్రి తలసాని అయితే.. ఇంటికొక పోలీసును పెట్టలేమన్నట్లుగా మాట్లాడారు.దాంతో.. విషయం రాజకీయ విమర్శలకు దారి తీసింది. ఓ వైపు పోలీసుల నిర్లక్ష్యం.. మరో వైపు…ప్రభుత్వ పెద్దలు పెద్దగా స్పందించకపోవడంతో.. విమర్శలు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో.. ట్విట్టర్లో మాత్రం మంత్రి కేటీఆర్.. ట్వీట్లు చేస్తున్నారు. ఈ కేసున తానే స్వయంగా పర్యవేక్షిస్తానంటూ.. కేటీఆర్ మొదటి రోజు ప్రకటించారు. ఆ జంతువుల్ని పోలీసులు శిక్షిస్తారని చెప్పుకొచ్చారు. హత్య కేసు విచారణ..పోలీసుల హడావుడి విషయంతో..కేటీఆర్ ట్వీట్.. పెద్దగా చర్చనీయాంశం కాలేదు. కానీ.. ఎప్పుడైతే పోలీసుల నిర్లక్ష్యం విమర్శలు రావడం ప్రారంభమయ్యాయో.. అప్పుడే… అసలు కేటీఆర్.. ఏ అధికారంతో.. తాను స్వయంగా కేసును మానిటర్ చేస్తానని ప్రకటించారనే సందేహాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో యంత్రాంగం అంతా నిర్వీర్యమైనపోవడానికి… ఇలాంటి పరిస్థితులే కారణమనే విమర్శలు జాతీయ స్థాయిలో వినిపిస్తున్నాయి. అసలు హోంమంత్రి చేయాల్సిన పని.. కేటీఆర్ చేస్తానని ప్రకటించుకోవడంతోనే.. పాలన.. ఎక్కడ ఇరుక్కుపోయిందో అర్థమైందంటున్నారు.
ప్రశ్నించడానికి లోకల్ మీడియా వణికిపోతోందా..?
స్థానిక మీడియా నిర్వీర్యం అయిపోయిన విషయం కూడా.. ప్రియాంకరెడ్డి హత్య ఉదంతంతో తేలిపోయింది. ప్రభుత్వాన్ని విమర్శించడానికి… ఒక్కటంటే.. ఒక్క మీడియా ధైర్యం చేయలేదు. నిర్బయ ఘటన జరిగినప్పుడు.. కేంద్ర ప్రభుత్వమే కదిలింది. కానీ.. ప్రియాంకరెడ్డి ఘటన జరిగినప్పుడు.. తెలంగాణ ప్రభుత్వంలో కదలిక లేదు. సీఎం కేసీఆర్.. ఒక్కటంటే.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం ప్రకటన కూడా చేయలేదు. ఓ వైపు.. తెలంగాణ మొత్తం.. అట్టుడికిపోతూంటే.. ఆయన ఆర్టీసీ కార్మికులతో.. ఏం చర్చించాలన్నదానిపై.. శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ విషయాన్ని.. జాతీయ మీడియా తప్పు పట్టింది. కానీ లోకల్ మీడియాకు.. కేసీఆర్ ను ప్రశ్నించే ధైర్యం లేకుండా పోయింది.