తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్ని వైసీపీ వైపు మళ్లించడానికి… ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు.. చర్చనీయాంశమవుతున్నాయి. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవిపై.. వైసీపీ నేతలు ప్రస్తుతం ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఆయన గతంలో.. వైసీపీలోనే ఉండేవారు. టీడీపీలో చేరారు. టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు.. ఆయనను మళ్లీ తమ పార్టీలోకి రావాలని.. వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారు. అద్దంకిలో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా.. తాను రాలేనని.. ఆయన వైసీపీకి చెప్పేశారు. అలా అయితే.. తాము చేయాలనుకున్నది చేస్తామంటూ… ప్రభుత్వం వైపు నుంచి కార్యాచరణ ప్రారంభమయింది. గొట్టిపాటి రవి వ్యాపారాలు, ఆర్థిక మూలాలపై కొద్దిరోజులగా దాడులు జరుగుతున్నాయి.
గొట్టిపాటి రవి కుటుంబానికి గ్రానైట్ వ్యాపారం ఉంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్న ఆయన కుటుంబానికి చెందిన క్వారీలపై విజిలెన్స్ దాడులు చేస్తోంది. మిగతా.. ఎవరి జోలికి వెళ్లడం లేదు. గొట్టిపాటి రవికి చెందిన క్వారీల్లోనే.. రోజుల తరబడి.. సోదాలు చేస్తున్నారు. మొదట.. ఓ వారం సోదాలు చేసి వెళ్లారు. గొట్టి పాటి వర్గం నుంచి కదలిక లేకపోవడంతో.. మరోసారి సోదాలు చేస్తున్నారు. ఈ సారి మరింత.. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసేందుకు.. క్వారీలు ఎలా ఉండేవో.. అంటూ..ఆర్టిస్టులును తీసుకొచ్చి స్కెచ్ులు గీయిస్తున్నారు.
ప్రతిపక్ష హోదా పోవాలంటే కనీసం ఆరుగురు ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులు బయటకు రావాల్సి ఉంటుంది. ఇప్పటికే వల్లభనేని వంశీ బయటకు వచ్చారు. మిగిలిన ఐదుగురి కోసం.. వైసీపీ వేట ప్రారంభఇంచారు. హిట్ లిస్ట్‌లో ఉన్న గొట్టిపాటిరవిపై.. సోదాలతో తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. రవికుమార్ క్వారీల్లో మొదట తనిఖీలు చేసినప్పుడు.. ఏమీ దొరకలేదని.. ఏదోస్థాయిలో లోపాలు బయటపడితే.. నోటీసులు జారీ చేయడానికి రెండో సారి సోదాలు చేస్తున్నారని.. గొట్టిపాటి వర్గీయులు అంటున్నారు. మరి వైసీపీ ఒత్తిడి ఫలిస్తుందో లేదో చూడాలి..!