రాంగోపాల్ వర్మ – జొన్నవిత్తుల మధ్య మాటల యుద్ధం ఎంత వరకూ వెళ్లిందో తెలియంది కాదు. ఈమధ్య టీవీ ఛానళ్లలో ఇద్దరూ లైవ్ డిబేట్లలో కూర్చుని, ఒకరిపై ఒకరు ఘాటైన కామెంట్లు చేసుకున్నారు. హిందూ ధర్మం, సంస్క్రృతిని వర్మ సర్వనాశనం చేస్తున్నాడన్నది జొన్న విత్తుల ప్రధాన ఆరోపణ. జొన్నవిత్తులను వర్మ కూడా చాలాసార్లు చెడుగుడు ఆడేసుకున్నాడు. దాంతొ జొన్నవిత్తుల దెబ్బకు దెబ్బ తీయాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. వర్మ దారిలోనే వెళ్లి వర్మమీద ఓ బయోపిక్ తీయాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం వర్మని పోలిన వ్యక్తిని కూడా ఆయన వెదికి పట్టుకున్నార్ట.
బయోపిక్ లు తీసే వర్మ మీదే బయోపిక్ తీయాలనుకోవడం మంచి ఆలోచనే. కాకపోతే.. వర్మ జీవితం తెరచిన పుస్తకం. పెద్దగా రహస్యాలేం లేవు. తన ఆలోచనా ధోరణి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. బయోపిక్‌లో కొత్త విషయాలేమైనా ఉండాలి. అప్పుడే ఆసక్తి మొదలవుతంది. వర్మ తన రహసాల్ని సైతం పబ్లిసిటీ కోసం అప్పుడప్పుడూ వాడుకుంటుంటాడు. పైగా జొన్నవిత్తుల దర్శకత్వం అంటే… ప్రాజెక్టుపై ఆసక్తి ఎందుకు ఉంటుంది? అయినా బయెపిక్లు తీసి, వాటి చుట్టూ ఏదోలా కొన్ని వివాదాలు సృష్టించి, సినిమాతో సొమ్ములు చేసుకోవడం వర్మకి వెన్నతో పెట్టిన విద్య. అది అందరికీ అబ్బొద్దూ…?!