కొద్ది రోజుల క్రితం.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కాంట్రాక్ట్ కంపెనీపై ఐటీ, ఈడీ జరిపిన దాడులకు సంబంధించి… దొరికిన ఆధారాలతో అధికారులు నోటీసులు జారీ చేయడం ప్రారంభించారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా.. ఆ కంపెనీపై.. మెగా సోదాలు నిర్వహించారు.. ఐటీ అధికారులు. దాదాపుగా.. పది రోజులు జరిగిన సోదాల్లో.. అతి పెద్ద హవాలా నెట్‌వర్క్‌కు సంబంధించిన ఆధారాలు కనిపెట్టామని.. తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్ … ప్రకటన కూడా విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ సంస్థ రూ. 170 కోట్లు పంపిందన్న ప్రచారం మీడియాలో జరిగింది. అలాగే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ముఖ్యుడికి మరో రూ. 150 కోట్ల వరకూ చెల్లింపులు చేసినట్లుగా సీబీడీటీ ప్రకటించింది.
ఇప్పుడు.. ఆ డబ్బులు అందుకున్న వారికి నోటీసులు జారీ చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రూ. 170 కోట్లు అందినట్లుగా ఆధారాలు లభించడంతో… ఆ పార్టీకి.. ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్లుగా… తెలుస్తోంది. ఈ మేరకు.. ఇంగ్లిష్ చానల్ టైమ్స్ నౌ… ఈ వివరాలను ప్రకటించింది. హైదరాబాద్ బేస్డ్ కంపెనీ నుంచి ఏఐసిసికి రూ. 170 కోట్లు అందాయని.. అది హవాలా మార్గంలో వచ్చినట్లుగా తెలిసిందని.. ఆ లావాదేవీల గురించి చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఆ డబ్బును ఏఐసిసి తన లెక్కల్లో చూపించిందా..? ఎలా ఖర్చు చేశారు అన్న వివరాలు చెప్పాలని కోరింది.
ఆ హైదరాబాద్ సంస్థ… తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నేతలకు సన్నిహితుడు. ఎన్నికల సమయంలో… తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు చెందిన డబ్బే… కీలక పాత్ర పోషించిందని చెబుతున్నారు. ఓ ముఖ్యుడు రూ. 150 కోట్లు అమ్ముకున్నట్లుగా కఇప్పటికీ ఐటీ అధికారులు చెప్పడంతో.. ఆయనకు కూడా త్వరలో నోటీసులు జారీ చేస్తారని భావిస్తున్నారు.