జనసేనాని పవన్ కల్యాణ్ రాజకీయ విమర్శలు, ఆయన పర్యటనలపై.. వైసీపీ చాలా ఎక్కువగా ఆందోళన చెందుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమ పర్యటనలో ఉన్న పవన్ … ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. చేతకాకపోతే దిగిపొమ్మని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల బాధల్ని ఏకరవు పెడుతూ.. ప్రభుత్వ వైఫల్యాల్ని.. హైలెట్ చేస్తున్నారు. నిన్న ఏకంగా… జగన్‌ను తాను సీఎంగా గుర్తించడం లేదని ప్రకటించేశారు. ఈ పరిస్థితులన్నీ.. వైసీపీని.. ఆందోళనలోకి నెడుతున్నాయి. ఆ పార్టీ నేతలు పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా టార్గెట్ చేసేందుకు.. ఓ టీంను నియమించుకున్నట్లుగా తెలుస్తోంది.
పవన్ సూటి విమర్శలను తట్టుకోలేకపోతున్న వైసీపీ..!
పవన్ కల్యాణ్ ఇలా విమర్శలు చేయడం ఆలస్యం.. అలా జగన్ మీడియా తెర మీదకు వైసీపీ నేతలు వచ్చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇచ్చేందుకు పేర్ని నాని ఎప్పుడూ.. వైసీపీ ఆఫీసుకు అందుబాటులో ఉంటున్నారు. కొద్ది రోజలు క్రితం.. జగన్ రెడ్డి అని పవన్ కల్యాణ్ సంబోధించిన అర గంటలోనే.. ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. పవన్ నాయుడూ అంటూ సంబోధించి కలకలం రేపారు. ఆ తర్వాత కూడా.. పవన్ కల్యాణ్.. ఎక్కడైనా విమర్శలు చేసిన.. నిమిషాల్లోనే.. పేర్ని నానితో పాటు.. మరికొంత మంది కాపు నేతలు.. రంగంలోకి దిగిపోతున్నారు. పవన్ కల్యాణ్ పై కులపరమైన విమర్శలు చేస్తున్నారు.
జనసేన కన్నా.. బీజేపీతో వైసీపీకే సంబంధాలెక్కువ..! ఆ లెక్కన విలీనం చాన్స్ ఎవరికి..?
తిరుపతిలో పవన్ కల్యాణ్… సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గుర్తించడం లేదని… జగన్ తరహా రాజకీయాలకు అమిత్ షా, మోడీనే కరెక్టని.. పవన్ కల్యాణ్ అన్న నిమిషాల్లోనే పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టారు. అమిత్ షా … తరహా రాజకీయాలు.. వైసీపీకి కరెక్టనిని పవన్ చేసిన ప్రకటనపై .. విపరీతార్థాలు తీశారు. ఇక బీజేపీలో కలిపేయడమే మిగిలిందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నిజానికి పవన్ కల్యాణ్.. కన్నా బీజేపీతో రాసుకుపూసుకు తిరుగుతోంది వైసీపీనే. ఎన్నికల సమయంలో.. బీజేపీ ఓట్లన్నీ.. వైసీపీకే పడ్డాయన్నది బహిరంగ రహస్యం. అంతే కాదు.. మోడీ కనిపిస్తే కాళ్లకు నమస్కారం పెట్టకుండా వెనక్కి రారు జగన్. ఆయన పార్టీని… బీజేపీలో కలుపుతున్నారని అర్థం కాదుగా..! అలాంటి విమర్శలు జనసేన నేతలు చేయలేదు గా.. ! కానీ.. అమిత్ షా రాజకీయాలే వైసీపీ కరెక్టనగానే..వైసీపీ నేతలు తెర ముందుకు వచ్చేశారు.. పార్టీని బీజేపీలో కలుపుతారా.. అంటూ చెలరేగిపోయారు. పవన్ పై విమర్శలు చేయడానికి వైసీపీ నేతలు ఓ సిద్దాంతం అంటూ పెట్టుకోలేదు. ఇంత కాలం.. టీడీపీ అధినేత చంద్రబాబుకు కాల్షీట్లు ఇచ్చారంటూ విమర్శలు చేసి.. ఇప్పుడు అమిత్ షాను పొగిడే సరికి.. బీజేపీలో కలుపుతారా అంటూ.. కౌంటర్లు ఇస్తున్నారు. అదే కాదు.. పేర్ని నాని.. పవన్ ను కుల పరంగా… కించ పరిచేందుకు.. .. పవన్ నాయుడూ అనే సంబోధిస్తూ మాట్లాడుతున్నారు.
పవన్‌ను గుర్తించకపోతే ఇంత హైరానా ఎందుకు పడుతున్నట్లు..?
సీఎంగా జగన్ ను పవన్ కల్యాణ్ గుర్తించరని చేసిన ప్రకటనపై.. తాను పవన్ కల్యాణ్‌ను గుర్తించడం లేదని ప్రకటించారు. మాటల్లోనే అలా.. కానీ పవన్ కల్యాణ్‌ను… వైసీపీ సర్కార్.. ఎంత గుర్తించిందో.. వారి స్పందనను బట్టే తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పర్యటన ఎక్కడ ఉందో.. ఆయన ఏం ప్రసంగిస్తారో.. చాలా కేర్‌ఫుల్‌గా ప్రత్యేక బృందాలతో పరిశీలిస్తున్నారు. వెంటనే… దానికి కౌంటర్ రెడీ చేస్తున్నారు. ఆయన టూర్ ఉందంటే.. పేర్ని నానికో..మరో కాపు నేతతోనే.. క్షణాల్లో కౌంటర్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతోంది. అంటే.. పవన్ కల్యాణ్‌కు.. వైసీపీ ఎంత భయడుతుందో.. అర్థమవుతోందని… జనసేన నేతలు అంటున్నారు. అందులో… అతిశయోక్తి ఏమీ లేదు. పవన్ కు వైసీపీ ఇస్తున్న ప్రాధాన్యం అదే స్థాయిలో ఉంది మరి.. !