మత మార్పిళ్లు నేరమా.. అని ఏపీ మంత్రి సుచరిత పవన్ కల్యాణ్‌కు సూటిగా ప్రశ్నించారు. దుర్గమ్మ సన్నిధిలో.. కృష్ణానదిలో.. మత మార్పిళ్లు చేస్తున్న వీడియో ఒకటి.. హల్ చల్ చేసింది. గుడికి వస్తున్న వారిని టార్గెట్‌గా చేసి మత మార్పిడికి పాల్పడుతున్నారని.. ఇదంతా.. ఎవరి అండతో జరుగుతోందని..పవన్ కల్యాణ్.. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగ విరుద్ధమని..సూడో సెక్యూలరిస్టులంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై.. మంత్రి సుచరిత ఉలిక్కిపడ్డారు. మత మార్పిడి చేసుకోవడం నేరమా? ఇష్ట ప్రకారం మతమార్పిడి చేసుకుంటే తప్పేంటని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించారు.
మత మార్పిళ్ల అంశంపై.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు.. సుచరిత ఉలిక్కి పడటానికి కారణం ఉంది. ఆమె కూడా కన్వర్టడ్ క్రిస్టియన్. అయితే.. ఎస్సీ రిజర్వేషన్ ఉన్న ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఓ యూ ట్యూబ్ చానల్ ఇంటర్యూలో.. తాను.. క్రిస్టియన్ మతం తీసుకున్నానని నేరుగా చెప్పారు. నిజానికి.. ఆమె అలా క్లెయిమ్ చేసుకోక ముందే.. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి విషయంలో… రగడ జరుగుతోంది. ఆమె కూడా క్రిస్టియన్ మతం తీసుకుని ఎస్సీగా చెప్పుకుని.. పోటీ చేశారు. విజయం సాధించారు. ఆమెపై రాష్ట్రపతికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. విచారణ జరుగుతున్నప్పటికీ.. తమ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి.. వారు ధైర్యంగా.. క్రిస్టియన్స్ మి అని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. అధికారికంగా మాత్రం.. ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు.
స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా.. కన్వర్టడ్ క్రిస్టియన్. రిజర్వుడు నియోజకవర్గాల్లో అనేక మందికి.. టిక్కెట్లు ఇచ్చిన వారంతా.. కన్వర్టడ్ క్రిస్టియన్స్ అన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మత మార్పిళ్లు పెరిగిపోయాయని… విమర్శలు వస్తున్న సమయంలో.. మంత్రులు.. మత మార్పిళ్లను సమర్థిస్తున్నారు. ఇష్టమైన మాత మార్పిడి చేయించుకుంటున్నారని వాదిస్తున్నారు. జగన్ మీడియాలో… కూడా.. మత మార్పిళ్లు తప్పేమి కాదని.. ఆర్టికల్స్ ప్రచురిస్తున్నారు. ఇవన్నీ.. వివాదాస్పదమవుతున్నాయి.