గత ఐదేళ్ల కాలంలో భారత్‌లోకి వచ్చిన అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కియా కార్ల ప్లాంట్. ఈ పరిశ్రమ చంద్రబాబు హయాంలో… వచ్చింది. ప్రభుత్వం శరవేగంగా ప్రభుత్వం తరపున భూమి, నీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించింది. అంతే వేగంగా.. కియా యాజమాన్యం కూడా ప్లాంట్ ను రెడీ చేసింది. కార్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పటికి పధ్నాలుగు వేల కార్లను..భారత్‌లో అమ్మింది. అంతే స్థాయిలో… విదేశాలకు ఎగుమతి కూడా చేసింది. మేడిన్ ఆంధ్రా.. బ్రాండ్ కార్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాయి. అయితే.. హఠాత్తుగా.. కియా కార్ల ప్లాంట్‌ను ప్రారంభిస్తానని జగన్ అనంతపురం బయలుదేరారు.
దేశంలోనే అతి పెద్ద ఎఫ్‌డీఐ .. కియా పరిశ్రమ..!
కియా కార్ల పరిశ్రమ… పారిశ్రామికీకరణలో..ఓ పెద్ద ముందడుగు. హైదరాబాద్‌కి తొలి సారి మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత… దాని కేంద్రంగా.. ఎన్ని కంపెనీలు వచ్చాయి… ఎంత అభివృద్ధి చెందిందనేది… అందరూ కళ్లారా చూశారు. ఇప్పుడు.. అనంతపురం జిల్లాకు కూడా కియా అలాంటిదే. బెంగళూరుకు సమీపంలో ఉండటం… ఎగుమతులకు అటు చెన్నై, ఇటు కృష్ణపట్నం పోర్టులు కూడా.. కాస్తంత సమీపంలోనే ఉండటంతో.. అనంతపురం.. ఇక ఆటోమోబైల్ హబ్‌గా మారుతుందని అందరూ భావించారు. దానికి తగ్గట్లుగానే.. పెద్ద ఎత్తున గత ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి. కియా అనుబంధ పరిశ్రమలు కూడా ప్లాంట్లు పెట్టడానికి రెడీ అయ్యాయి.
ప్రభుత్వం తీరుతో వెనక్కి వెళ్లిపోతున్న పెట్టుబడిదారులు..!
ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితి మారిపోయింది. కియా యాజమాన్యంతో.. కొత్త ప్రభుత్వానికి చెందిన కొంత మంది దురుసుగా ప్రవర్తించారు. మరికొంత మంది .. ప్లాంట్ నడవాలంటే.. తాము చెప్పినట్లు చేయాలన్న బెదిరింపులకు కూడా పాల్పడ్డారన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో.. ఉద్యోగాల కోసం.. వైసీపీ నేతలు బెదిరింపులకు గురి చేశారు. ఈ అంశంపై పలుమార్లు కేసులు నమోదయ్యాయి. పైగా ప్రభుత్వ నిర్ణయాలతో… పారిశ్రామివేత్తలకు.. నెగెటివ్ సెంటిమెంట్ ఏర్పడింది. పెట్టుబడిదారులు ఎవరూ రావడం లేదు. అంతే కాదు.. జగన్మోహన్ రెడ్డి.. చాలా పరిమితమైన ఆలోచనలు చేస్తారని… టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమలను.. మరో విధంగా ట్రీట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. గతంలో కియా ప్లాంట్ ప్రారంభోత్సవానికి జగన్ సమయం ఇచ్చి డుమ్మాకొట్టారు. అప్పుడు మంత్రి బుగ్గన ప్లాంట్ ప్రారంభించారు.
అయిపోయిన ప్రారంభోత్సవాన్ని మళ్లీ చేస్తే పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచగలరా..?
ఇలాంటి పరిస్థితుల్లో… కియా ప్లాంట్ ను మళ్లీ ప్రారంభిస్తే… పెట్టుబడిదారులకు ఓ సందేశం పంపినట్లుగా ఉంటుందని.. ఆయనకు కొంత మంది సలహాదారులు.. సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆరు నెలల్లో ఒక్కటంటే.. ఒక్క పెట్టుబడి ఏపీకి రాకపోవడం…ఉన్న పరిశ్రమల పట్ల.. దారుణంగా వ్యవహరిస్తున్నారనే భావన పోవాలంటే… ఈ కార్యక్రమం పెట్టుకోవడం మంచిదని సలహా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీనికి జగన్ అంగీకరించడంతో.. వైసీపీ నేతలు..కియా యాజమాన్యాన్ని సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏ ప్రతిపాదన పెట్టినా.. అంగీకరించక తప్పని పరిస్థితుల్లో కియా ఉంది. అందుకే… ప్లాంట్ ఓపెనింగ్ పేరుతో.. ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయక తప్పలేదంటున్నారు.