ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ మీడియా సలహాదారు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త.. తెలుగు మీడియాలో కీలకమైన రోల్ పోషించడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే అచేతన స్థితికి చేరిన “మహా” టీవీ చానల్ చైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపట్టారు. టీడీపీ ప్రభుత్వంలో నాలుగేళ్లకు పైగా ఆయన మీడియా సలహాదారుగా వ్యవహరించారు. బీజేపేతో సంబంధాలు చెడిపోయినప్పటికీ.. చంద్రబాబు ఆయనపై విశ్వాసం ఉంచి కొనసాగించారు. అయితే.. జగన్మోహన్ రెడ్డి… విమర్శలు చేయడంతో ఆయన పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత కొంత కాలం.. సొంత మీడియా ప్రాజెక్టుపై వర్క్ చేశారని చెబుతారు. ఇప్పుడు.. పరిస్థితులు మారిపోవడం… పలువురు టీడీపీ పారిశ్రామిక నేతలు.. బీజేపీలో చేరడం… ఆయనకు కొత్త బాధ్యలు రావడానికి కారణంగా మారిందని చెబుతున్నారు.
మహాన్యూస్ చానల్‌ను.. కొన్నాళ్ల కిందట.. సుజనా చౌదరినే ప్రమోట్ చేశారని చెబుతారు. ప్రముఖ జర్నలిస్ట్ ఐ. వెంకట్రావు నేతృత్వంలో నడిచేది. ప్రస్తుత టీవీ9 తెలుగు హెడ్ రజనీకాంత్.. అప్పట్లో ఆ చానల్లో చేరి… దానికి ఓ దశ.. దిశ తీసుకొద్దామని ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. ఆయన వల్ల కాకపోవడంతో.. వదిలేసి మళ్లీ టీవీ9లో చేరిపోయారు. ఆ తర్వాత ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో.. చానల్ ఒడిదుడుకుల్లో పడింది. టీఆర్పీల సంగతి తర్వాత ముందు మనుగడ సాగాలన్న లక్ష్యంతో.. చేతులు మారుతూ వచ్చింది. రెండేళ్ల కిందట… మారెళ్ల వంశీ అనే జర్నలిస్టు దాన్ని తీసుకుని… కొంత మంది టీడీపీ నేతల సహకారంతో.. నడిపించారు. ఇప్పుడు వారు కూడా చేతులెత్తేశారు. దాంతో.. మళ్లీ సుజనా చౌదరి హ్యాండ్ పడాల్సి వచ్చిందంటున్నారు.
బీజేపీకి మద్దతుగా.. సుజనా చౌదరి.. మహాన్యూస్‌లో మళ్లీ పెట్టుబడులు పెట్టారని.. ఆయన సూచనతోనే… పరకాల ప్రభాకర్.. మహా టీవీని సంస్కరించడానికి అంగీకరించారని చెబుతున్నారు. ప్రస్తుతం మహాన్యూస్ విస్తరణ ప్రణాళికలు కూడా వేస్తోందంటున్నారు. ఆర్థిక బాధలేవీ ఇక నుండి ఉండే అవకాశం లేదన్న ప్రచారం జరుగుతూండటంతో.. పరకాల చానల్‌ను ప్రముఖంగా తీర్చిదిద్దాలన్న పట్టుదలతో ఉన్నారని అంటున్నారు.