కియా పరిశ్రమ ప్రారంభమైన ఆరు నెలల తర్వాత మరోసారి ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి. ఆయన అలా ప్రారంభించడం ఆలస్యం.. ఇలా క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగింది. పదేళ్ల కిందట చనిపోయిన.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషితో.. ఇప్పుడు.. కియా పరిశ్రమ ఏపీకి వచ్చిందని.. దాన్ని జగన్ ప్రారంభించారని.. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. దీంతో సోషల్ మీడియాలో ఒక్క సారిగా ట్రోలింగ్ ప్రారంభమయింది. కియా పరిశ్రమకు వ్యతిరేకంగా వైసీపీ చేసిన ఉద్యమాలు.. ఒక్క సారిగా తెరపైకి వచ్చాయి. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు అయితే.. ఆ పరిశ్రమ మూతపడేది అని.. దివాలా అంచున ఉందని.. దాన్ని చంద్రబాబు తీసుకొచ్చి.. రాయితీలిస్తున్నారన్న ఆరోపణలు కూడా చేశారు.
నిజానికి ఎన్నికల ప్రచారంలో.. జగన్మోహన్ రెడ్డి అనంతపురం వెళ్లారు. కియా పరిశ్రమ ఉన్న పెనుగొండకు కూడా వెళ్లారు. అక్కడ ఆయన … తన తండ్రి వైఎస్ వల్ల కియా పరిశ్రమ వచ్చిందని చెప్పలేదు. కానీ… ఆ క్రెడిట్‌ను తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు కాక… నరేంద్రమోడీకి ఇచ్చారు. నరేంద్రమోడీ వల్లే ఏపీకి కియా మోటార్స్ వచ్చిందని ప్రకటించారు. అంటే.. దాదాపుగా పదేళ్ల కిందట చనిపోయిన తన తండ్రిని క్రెడిట్ ఇవ్వడానికి ఆయనకు కూడా మనసొప్పలేదు. కానీ అధికారం అందిన తర్వాత మాత్రం… తండ్రి ఖాతాలో ఆ విజయం చేరుస్తున్నారు. కియా మోటార్స్‌కు ఏపీ నుంచి ప్రతిపాదనలు వెళ్లినప్పుడు.. వైఎస్ జీవించి ఉన్నారా.. లేదా … అన్నది తర్వాతి విషయం ముందుగా తమ పార్టీకి మూలపురుషుడైన.. వైఎస్‌కు..ఎక్కడ లేని క్రెడిట్ ఇవ్వడానికి.. వైసీపీ నేతలు తాపత్రయ పడుతున్నారు.
సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే.. నమ్మేవాళ్లు నమ్ముతారు.. తమ క్రెడిట్ తమకు వస్తుందని వైసీపీ నేతలు ఆశ పడుతున్నారు. సోషల్ మీడియా ప్రచారం వల్ల తిమ్మిని బమ్మిని చేయగలిగామని..వైసీపీ నేతల నమ్మకం. ఏపీ ప్రజల తెలివి తేటల పట్ల.. వారికి అంతు లేని నమ్మకం ఉందన్న అభిప్రాయం కూడా… ఉంది. ఈ క్రమంలో.. ఎలాంటి ప్రచారానికైనా.. వెనుకాడటం లేదు. ఈ పరిస్థితి.. ట్రోలింగ్‌కు గురవుతున్నా… వారు వెనుకాడటం లేదు.