వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వ్యవహారాలను చక్కబెట్టేందుకు పెట్టుకున్న వారు.. సమర్థంగా విధులు నిర్వహించలేకపోతున్నారు. అటు విజయసాయిరెడ్డి అయినా.. ఇటు.. ప్రవీణ్ ప్రకాష్ అయినా… ఇద్దరూ.. తమ తమ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల జగన్ మోహన్ రెడ్డిని ఢిల్లీలో ప్రముఖుల ఇంటి ముందు వెయిటింగ్ లిస్టులోనే ఉంచుతున్నారు. అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారయిందని… తక్షణం బయలుదేరి రావాలని.. జగన్కు.. నిన్న ఉదయం.. ఢిల్లీ నుంచి సమాచారం వచ్చింది. అనంతపురం కియా పరిశ్రమ రీ ఓపెనింగ్ కు వెళ్లిన జగన్.. అక్కడ్నుంచి హడావుడిగా అమరావతి వచ్చేసి.. ఢిల్లీ బయలుదేరారు. తీరా.. ఢిల్లీ వెళ్లిన తర్వాత అక్కడ…. ఎవరి అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. పది గంటలకు.. జగన్మోహన్ రెడ్డి అమిత్ షాతో భేటీ అవుతారని.. మీడియాకు సమాచారం ఇచ్చారు. దాంతో మీడియా ప్రతినిధులందరూ.. అమిత్ షా ఇంటి వద్దకు చేరుకున్నారు.
పది గంటలకు.. సీఎంవోలో చక్రం తిప్పుతున్న అధికారి ప్రవీణ్ ప్రకాష్.. అమిత్ షా ఇంటి వద్దకు వచ్చారు. ఆ సమయం అలా గడిచిపోతూనే ఉంది. కానీ ముఖ్యమంత్రి మాత్రం రాలేదు. కారణం.. అమిత్ షా.. సమయం ఇవ్వకపోవడమే. తర్వాత ప్రవీణ్ ప్రకాష్ కూడా వెళ్లిపోయారు. పన్నెండు గంటల వరకూ భేటీ జరగలేదు. నిజానికి అమిత్ షా… రాత్రి తొమ్మిది గంటల తర్వాత.. ఎంతో ముఖ్యమైతే తప్ప.. ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వరని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అలాంటిది.. జగన్మోహన్ రెడ్డికి పన్నెండు గంటలకు ఎలా ఇస్తారని.. భావించారని… మీడియా ప్రతినిధులు కూడా సెటైర్లు వేశారు.
జగన్మోహన్ రెడ్డిని గతంలో కూడా.. విజయసాయిరెడ్డి ఇలాగే.. అపాయింట్మెంట్లు ఖరారరయ్యాయని ఢిల్లీకి పిలిపించి.. అభాసుపాలు చేశారు. ఎదురు చూసి.. చూసి.. ఆయన అమరావతి వచ్చేశారు. ఆ తర్వాత… మరోసారి అపాయింట్మెంట్ ఖరారు చే్శారు కానీ.. ఆ రోజు.. అమిత్ షా పుట్టిన రోజు. శుభాకాంక్షలు చెప్పే వారి జాబితాలో జగన్ పేరును చేర్చి.. అదే అపాయింట్మెంట్గా చెప్పుకుని సంతోషపడ్డారు. ఇప్పుడు.. మళ్లీ అదే పునరావృతం అయింది. అమిత్ షాతో భేటీ సంగతి ఏమీ తేలలేదు కానీ..నేడు మోడీతో మాత్రం.. అధికారిక సమావేశం ఖరారైనట్లుగా చెబుతున్నారు.