“దిశ” జరిగిన అన్యాయం దేశంలో మరో ఆడపిల్లకు జరగకూడదంటే.. బియాండ్ ది లా ఆలోచించాలి. దేశంలో ఉన్న చట్టాలు.. ప్రస్తుతానికైతే.. నిందితులకు భయం పుట్టించడం లేదు. వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ.. ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదన్న భారత లా మౌలిక సూత్రం… నేరస్తులు.. తప్పించుకోవడానికి కారణం అవుతోంది. ఈ క్రమంలో.. పోలీసులే అప్పుడప్పుడూ.. న్యాయం చేయాల్సి వస్తోంది. ఇలాంటి న్యాయం చేయడంలో.. ఐపీఎస్ సజ్జనార్ ముందున్నారు. అమ్మాయిలపై దాడులకు పాల్పడిన వారికి క్యాపిటల్ పనిష్మెంట్ని.. తనదైన శైలిలో చట్టపరిధిలోనే అమలు చేసి.. శభాష్ అనిపించుకుంటున్నారు.
నాడు వరంగల్ యాసిడ్ బాధితులకు ఇన్స్టంట్ న్యాయం..!
సీపీ సజ్జనార్..కెరీర్లో ఇలాంటి సంచలన ఎన్కౌంటర్లు రెండో సారి. 2008లో వరంగల్ ఎస్పీగా ఉన్నప్పుడు కూడా.. ఇలాంటి సంచలనాత్మక ఘటన ఒకటి జరిగింది. అదే యాసిడ్ దాడి. వంరగల్‌లో స్వప్నిక, ప్రణీత అనే యువతులపై శ్రీనివాస్ అనే వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. అతనికి మరో ఇద్దరు సహకరించారు. ఈ ఘటన 2008 డిసెంబరు 10న జరిగింది. ఈ ఘటనలో స్వప్నిక మరణించింది. ప్రణీతకు ఆ ఘటన.. ఇప్పటికీ.. వెంటాడుతూనే ఉంది. ఈ ఘటన జరిగిన తర్వాత.. రాష్ట్రం మొత్తం ఒక్క సారిగా గగ్గోలు రేగింది. ఆ నిందితులను అలా వదిలి పెడితే..యాసిడ్ దాడులు పెరిగిపోతాయన్న చర్చ జరిగింది. వెంటనే.. ఎస్పీగా ఉన్న సజ్జనార్.. చాన్స్ తీసుకోలేదు. నిందితులుగా ఉన్న మొత్తం ముగ్గుర్ని.. చట్టబద్ధంగా ఎన్ కౌంటర్ చేశారు. ఇప్పటిలాగే… అప్పుడు కూడా తప్పించుకుని పోవడానికి నిందితులు ప్రయత్నించడంతో కాల్చేశారు. ఆ తర్వాత యాసిడ్ దాడులు చాలా వరకూ తగ్గిపోయాయని రికార్డులు కూడా చెబుతున్నాయి.
నేడు “దిశ”కు ఎనిమిది రోజుల్లోనే న్యాయం..!
సైబరాబాద్ కమిషనర్‌గా ఉన్న సజ్జనార్ కు.. పదకొండేళ్ల తర్వాత వరంగల్ లాంటి పరిస్థితే ఎదురయింది. ఏం చేయాలో.. ఆయనకు..అనుభవం ఉంది. ప్రజల నుంచి మద్దతు ఉంది. డిమాండ్ ఉంది. వరంగల్ న్యాయం ఇక్కడ అమలు చేసినా… ప్రశంసించేవారే తప్ప.. ఖండించేవారు ఉండరు. సజ్జనార్‌కు ఆ సపోర్ట్ సరిపోయింది. వారికి నిందితులు కూడా సహకరిచారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తమ తుపాకులను లాక్కునేందుకు ప్రయత్నించారు. ఫలితంగా.. దిశకు న్యాయం జరిగిపోయింది.
భయం.. భయం పుడితేనే నేరాలు ఆగుతాయి..!
చట్టాలున్నది.. నేరాలు జరిగిన తర్వాత శిక్షించడానికి కాదు. నేరం చేస్తే.. ఫలానా శిక్ష పడుతుందని భయ పెట్టడానికే. అలా భయం పెరిగినప్పుడే.. ఆటోమేటిక్ గా నేరాలు తగ్గిపోతాయి. ఇండియన్ పీనల్ కోడ్లు… సీఆర్పీసీ.. కోర్టు విచారణలు ఇప్పుడు.. నేరస్తులకు భయాన్ని తగ్గిస్తున్నాయి. వాటన్నింటిపై భయాన్ని కల్పించాలంటే… కొన్ని చర్యలు తప్పడం లేదు. అలాంటి వాటిలో సజ్జనార్.. ముందు ఉంటున్నారు. దిశకు.. ఎప్పటికీ.. న్యాయం జరగదేమోనని… నిర్భయ లాంటి కేసుల్లో.. జరుగుతున్న జాప్యంతో దేశ ప్రజలు ఆందోళన చెందారు.
కానీ సజ్జనార్.. వాటన్నింటినీ పటాపంచలు చేశారు. న్యాయం చేశారు. శభాష్.. సీపీ సజ్జనార్ సార్..!