కాపుల రిజర్వేషన్ల గురించి తన అభిప్రాయాలు తెలియజేస్తున్న పవన్ కళ్యాణ్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా నిశితంగా విమర్శలు చేసారు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన పవన్ కళ్యాణ్ కి అసలు తను ఏమి మాట్లాడుతున్నాడో తనకయినా అర్ధం అయిందా? ప్రెస్ మీట్ పెట్టడానికి వస్తునప్పుడు కారులో తన పక్కన కూర్చొన్న వాడు ఎవడో ఏదో చెపితే ఆ ప్రభావంతో మాట్లాడారు. “కమ్మల మనస్తత్వం ఉన్న కాపుల కన్నా..స్వచ్చమయిన కమ్మల మనసున్న కాపులే మేలు విశ్వదాభిరామ వినురవేమ.”
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా పవన్ కళ్యాణ్ కి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. జనసేన పార్టీ స్థాపించినపుడు మీరు ఏమని చెప్పారు? ఇప్పుడు ఏమి చెప్పారో ఒకసారి పరిశీలించి చూసుకోండి. దానిని చూసి మీకు మీరే నేర్చుకోండి. పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను వ్యక్తపరిచిన నిజాలని ఆయన అభిమానులు ఎవరు వ్యతిరేకించినా అతను నా దృష్టిలో నమ్మక ద్రోహే.”
“పవన్ కళ్యాణ్ లో చిరంజీవి, చిరంజీవిలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగానే కాపులలో కమ్మలున్నారు అలాగే కమ్మలలో కూడా కాపులున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించినపుడు తన ప్రసంగంలో ఏమని చెప్పారో ఒకటికి రెండుసార్లు తన ప్రసంగ పాఠాన్ని చదివికొంటే బాగుంటుంది. ఆయన అభిమానిగా నేను ఆయన గురించి ఏవిధంగా చాలా నిజాయితీగా నా అభిప్రాయాలను చెపుతున్నానో, అదే విధంగా ఆయన అభిమానులు కూడా ఆనాడు ఆయన జనసేన పార్టీని స్థాపించి నపుడు ఆయన ఏమి చెప్పారో ఒకసారి గుర్తు చేసుకొని వాళ్ళు కూడా నిజాయితీగా తమ అభిప్రాయాలను ఆయనకు తెలియజేయాలని కోరుతున్నాను. వాస్తవ పరిస్థితులు ఏమిటో వాళ్ళకి తెలుసు కనుక పవన్ కళ్యాణ్ కూడా తన సోదరుడు చిరంజీవిలాగ దెబ్బ తినకముందే అభిమానులు ఈ విషయం (కాపులకు రిజర్వేషన్లు) గురించి తమ అభిప్రాయలు ఆయనకి తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని ట్వీటర్ లో సందేశం పెట్టారు.